మహిళ పట్ల అసభ్య ప్రవర్తన

ABN , First Publish Date - 2021-01-17T05:44:04+05:30 IST

ఎక్స్‌రే తీయించుకునేందుకు ల్యాబ్‌కు వెళ్లిన ఓ మహిళపట్ల ల్యాబ్‌ అసిస్టెంట్‌ అసభ్యంగా ప్రవర్తించాడు.

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన

డోన్‌, జనవరి 16: ఎక్స్‌రే తీయించుకునేందుకు ల్యాబ్‌కు వెళ్లిన ఓ మహిళపట్ల ల్యాబ్‌ అసిస్టెంట్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె కాలిచెప్పుతో బుద్ధి చెప్పింది. ఈ ఘటన డోన్‌ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. ప్యాపిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ మోకాలి నొప్పితో కొత్తపేటలోని ఆర్థో క్లినిక్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యుడు, ఆమెను ఎక్స్‌రే తీయించుకురావాలని సూచించారు. దీంతో ఆమె క్లినికల్‌ ల్యాబ్‌కు వెళ్లింది. అక్కడ ఉన్న ల్యాబ్‌ అసిస్టెంట్‌ ‘నీ భర్తతో ఎలా ఉంటావో.. అలా ఉండు’ అని అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధిత మహిళ చెప్పుతో సమాధానం చెప్పింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ల్యాబ్‌పై దాడికి దిగారు. అక్కడి నుంచి ల్యాబ్‌ అసిస్టెంట్‌ పరారయ్యాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పట్టణ పోలీసులు చేరుకుని సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

Updated Date - 2021-01-17T05:44:04+05:30 IST