యాప్‌లతో వేధించడం తగదు : ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2022-08-18T05:03:13+05:30 IST

యాప్‌లతో ఉపాధ్యాయులను వేధించడం తగదని యూటీఎఫ్‌ నాయకుడు పాలెం మహేష్‌బాబు అన్నారు. ప్రభుత్వం కక్ష కట్టి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని తెలిపారు. ఇందుకు నిరసనగా బుధవారం ఎంఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తానయ్య, సుందర్‌రాజు, మాధవి, శివయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యాప్‌లతో వేధించడం తగదు : ఉపాధ్యాయులు
ఒంటిమిట్ట: ఎంఈవో కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

ఒంటిమిట్ట, ఆగస్టు 17: యాప్‌లతో ఉపాఽధ్యాయులను వేధించడం తగదని యూటీఎఫ్‌ నాయకుడు పాలెం మహేష్‌బాబు అన్నారు. ప్రభుత్వం కక్ష కట్టి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని తెలిపారు. ఇందుకు నిరసనగా బుధవారం ఎంఈవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తానయ్య, సుందర్‌రాజు, మాధవి, శివయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


సంబేపల్లెలో ఉపాధ్యాయుల వినతి

సొంత ఫోన్‌లో ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ వద్దంటూ బుధవారం దేవపట్ల జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అభ్యంతరం తెలిపారు. రెండవరోజు యాప్‌ పనిచేయకపోవడంతో హాజరు వేయలేదు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయుడికి 16 మంది ఉపాధ్యాయులు వినతిపత్రం అందజేశారు. తమ సొంత ఫోన్‌లో ఇంటిగ్రేడెట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే తమ హాజరుతో పాటు విద్యార్థుల హాజరును నమోదు చేస్తామన్నారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. 

Updated Date - 2022-08-18T05:03:13+05:30 IST