కరోనా తెచ్చిన కష్టం!

ABN , First Publish Date - 2020-09-06T09:32:43+05:30 IST

కరోనాతో కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు...

కరోనా తెచ్చిన కష్టం!

కరోనాతో ఉపాధి, ఉద్యోగాలకు దెబ్బ

అప్పులు పెరగడంతో ఇబ్బందులు

ఎక్కువ వడ్డీ కట్టలేక చిరు ఉద్యోగులు, వ్యాపారులు సతమతం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నిజామాబాద్‌ )

నగరానికి చెందిన రాజేశ్‌ రెండేళ్లుగా ప్రైవేటు కంపెనీలో సేల్స్‌ డివిజన్‌లో పనిచేస్తున్నాడు. కరోనాతో లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత ఉద్యోగాలలో కోత పడింది. సేల్స్‌ తగ్గడంతో జీతాలలోనూ కోత పెట్టారు. కరోనాకు ముందు పరిస్థితి బాగా ఉండడంతో అప్పు చేసి ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొన్నాడు. ప్రస్తుతం జీతంలో కోత పడడం వల్ల నెలనెలా అప్పు చెల్లించలేక సతమతమవుతున్నాడు. 


మహారాష్ట్రలోని బిలోలి నుంచి వచ్చిన హన్మాండ్లు.. కుమార్‌ గల్లీలో పానీపూరి బండి నడుపుకొనేవాడు. అన్ని ఖర్చులు పోను నిత్యం చేతికి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు వచ్చేవి. అవసరానికి లక్ష రూపా యలు ప్రైవేటు వ్యాపారి వద్ద అప్పు చేశాడు. వారానికి వెయ్యి రూపాయలు చెల్లించేవాడు. అప్పు తీసుకున్న నెల రోజులకే లాక్‌డౌన్‌ వచ్చింది. వ్యాపారం దెబ్బతినడంతో అప్పుకట్టలేని పరిస్థితి ఏర్పడింది. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడిచేయడంతో ఇంట్లో ఉన్న బంగారం అమ్మి చెల్లించాడు. వ్యాపారం లేకపోవడంతో బండి మీద కూర గాయలు అమ్ముతున్నాడు.


ఇలా కేవలం ఈ ఇద్దరే కాదు.. కరోనాతో కారణంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు వ సూలు చేయోద్దు.. కిరాయిలు వాయిదా వేయాలి.. ఉ పాధి కరువైన ఈ సమయంలో కొంత గడువు ఇవ్వాల ని కేంద్ర ప్రభుత్వం చెప్పినా ప్రైవేటు వడ్డీ వ్యాపారులు వినడం లేదు. జిల్లాలో రుణాలు చెల్లించని వారి నుంచి వడ్డీ పెంచి మరీ వసూలు చేస్తున్నారు. ఆలస్యం చేస్తు న్న వారికి చక్రవడ్డీ పేరున అధిక వడ్డీలు వసూలు చే స్తున్నారు. అవసరాలకు అప్పులు తీసుకున్నవారు తప్ప ని పరిస్థితులలో వడ్డీలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. చేసేందుకు పనులు లేక, ఉపాధి క రువై ఇబ్బందులు పడుతున్నారు. 


జిల్లాలో కరోనా తీవ్రత మొదలయి ఐదు నెలలు గడి చింది. దేశవ్యాప్తంగా కరోనా సమస్య మొదలు కావడం తో కేంద్రం మార్చి 22న లాక్‌డౌన్‌ విధించింది. పలు నిర్ణయాలను ప్రకటించింది. రుణాలు తీసుకున్న వారి వద్ద వాయిదాలు, వడ్డీ వసూలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. మొదట మూడు నెలలు అవకాశం ఇచ్చిన కేంద్రం ఆ తర్వాత ఆగస్టు 31 వరకు పెంచింది. రుణా లతో పాటు కిరాయిలు వసూలు చేయవద్దని కోరింది. బ్యాంకుల ద్వారా విరివిగా ముద్ర రుణాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కరోనా కాలంలో అన్ని మూతపడి ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన వారు ఊరట చెందారు. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో జిల్లాలో కూడా ఆ ప్రభావం బాగా ఉంది. గల్ఫ్‌తో పాటు ఇతర ప్రాంతాల కు ఉపాధి కోసం వెళ్లిన వారు తిరిగి వచ్చారు. తమ స్వస్థలాలలో ఉపాధి వెదుక్కుంటున్నారు. వీరితో పాటు జిల్లాలో చిరు వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారు రోడ్డున పడ్డారు. ఉపాధి లేక తిప్పలు పడుతు న్నారు. జిల్లాలో చిన్నచిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చే సేవారితో పాటు సామాన్య ప్రజలు కరోనాతో ఇబ్బందు లు పడుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి కొంతమంది ఇబ్బందులు పడుతుండగా దీని ప్రభావంతో వేల మం ది ఉపాధి కోల్పోయారు. ప్రస్తుతం పనులు దొరకక ఇ బ్బందులు పడుతున్నారు. వ్యాపారం, కుటుంబ అవస రాల కోసం ప్రైవేటు అప్పులు చేసినవారు పనులు లేక తీర్చలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులలో అందరికీ అప్పులు దొరకక ప్రైవేటు వారి వద్ద అప్పులు తీసుకున్న వారు వడ్డీ పెరిగి తిరిగి కట్టలేక తిప్పలు ప డుతున్నారు. కొంత మంది ఇదే అదనుగా వడ్డీ పెంచి వసూలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా పది వేల నుంచి పది లక్షల వరకు రుణాలు ఇస్తున్నా రు. రుణం ఇచ్చే సమయంలోనే పది శాతం పట్టుకుం టున్నారు. నెలనెల మూడు నుంచి ఐదు శాతం వడ్డీ వ సూలు చేస్తున్నారు. మళ్లీ తీసుకునే సమయంలో మొ త్తం వసూలు చేస్తున్నారు. ఈ తరహా అప్పులు బోధన్‌, రుద్రూరు, వర్ని, కోటగిరి, డిచ్‌పల్లి, నిజామాబాద్‌ నగ రంలో ఉంది.


ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో మరీ ఎక్కువ గా ఉంది. రైతులు బలంగానే ఉన్న ఇతర వర్గాలు ఈ అప్పులు తీసుకుని కట్టలేక పోతున్నారు. కరోనా సమ యంలో కిరాణ దుకాణాలు, మందుల షాపులు. వైన్స్‌ మినహా ఏ వ్యాపారం సాగడం లేదు. చిరు వ్యాపారి నుంచి పెద్ద వ్యాపారి వరకు అప్పులు కట్టలేక సమస్య లు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉద్యోగాలు ఉండటం, వ్యాపారం ఉండటం వల్ల డబ్బులకు ఇబ్బందులు ఏర్ప డలేదు. అప్పు తెచ్చుకున్నా వడ్డీ భారం అనిపించలేదు. డబ్బులు చేతిలో ఉండటం వ్యాపారం నడువడం వల్ల చెల్లించేవారు. ప్రస్తుతం ఉపాధి లేకపోవడం, ఉద్యోగాలు పోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నా రు. కరోనా తగ్గి వ్యాపారాలు పుంజుకుంటే తప్ప సమ స్యల నుంచి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో ఎక్కువ మంది తమకు తెలిసిన వారు, బంధు వులు, స్నేహితులు చెప్పిన వారి ద్వారా తెచ్చుకోవడం ద్వారా తప్పనిసరి పరిస్థితులలో చెల్లిస్తున్నారు. ఒత్తిళ్లు పెరిగిన అధికారుల దృష్టికి తీసుకపోవడం లేదు. బ్యాం కుల ద్వారా చిరు వ్యాపారులకు, వ్యాపారులకు, వృత్తు లు చేసుకునేవారికి ముద్ర రుణాలు ఇచ్చారు. సామా న్య ప్రజలు, చిరు ఉద్యోగులకు అవకాశం దొరకలేదు. కరోనా తీవ్రత తగ్గేవరకు జిల్లాలోని సామాన్యులకు అ ప్పుల పరిస్థితి తప్పే అవకాశం కనిపించడం లేదు. మ ండలాల పరిధిలో అధిక వడ్డీలు వసూలు చేసేవారిపై అధికారులు దృష్టి పెడితే కొంత ఊరట దొరికే అవకా శం ఉంది. 

Updated Date - 2020-09-06T09:32:43+05:30 IST