‘నాన్నా...నువ్వే నా హీరోవి’

ABN , First Publish Date - 2021-01-24T10:15:51+05:30 IST

తండ్రి హిమాన్షు పాండ్యాతో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ హార్దిక్‌ పాండ్యా ..

‘నాన్నా...నువ్వే నా హీరోవి’

ముంబై: తండ్రి హిమాన్షు పాండ్యాతో గడిపిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ హార్దిక్‌ పాండ్యా ఆయనకు ఉద్వేగ భరిత నివాళి అర్పించాడు. హిమాన్షు ఈనెల 16న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ‘టు డాడ్‌’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాలో శనివారం హార్దిక్‌ రెండు నిమిషాల వీడియోను పోస్ట్‌చేశాడు. తండ్రితో గడిపిన ఆహ్లాదభరితమైన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఈ వీడియో రూపొందించాడు. కుమారులను మేటి క్రికెటర్లుగా తీర్చిదిద్దిన హిమాన్షును దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రశంసిస్తున్న సన్నివేశాన్నీ జోడించాడు. ‘నాన్నా..నువ్వే నా హీరోవి. నిన్ను కోల్పోవడం జీవితంలో అతిపెద్ద లోటు. అయితే నీవు విడిచి వెళ్లిన ఎన్నో మధుర స్మృతులు మాతో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి’ అని హృదయానికి హత్తుకు పోయేలా హార్దిక్‌ రాశాడు.

Updated Date - 2021-01-24T10:15:51+05:30 IST