ఏడాది తర్వాత తొలిసారి బంతి పుచ్చుకున్న హార్దిక్ పాండ్యా

ABN , First Publish Date - 2020-11-29T22:05:25+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన

ఏడాది తర్వాత తొలిసారి బంతి పుచ్చుకున్న హార్దిక్ పాండ్యా

సిడ్నీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఎదురీదుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. తొలి బంతి నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. 


ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా చెబుతున్న బుమ్రా నుంచి చాహల్ వరకు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. బంతి వేయడమే పాపమన్నట్టు చెలరేగిపోయారు. పట్టపగలే చుక్కలు చూపించారు. ఈ క్రమంలో బౌలింగ్‌లో మార్పు చేయాలని భావించిన కెప్టెన్ కోహ్లీ హార్దిక్ పాండ్యాతో నాలుగు ఓవర్లు బౌలింగ్ వేయించాడు.


పాండ్యా బౌలింగ్ చేయడం 14 నెలల తర్వాత ఇదే తొలిసారి. వెన్నుకు ఆపరేషన్ చేయించుకుని ఏడాదికిపైగా జట్టుకు దూరమైన పాండ్యా తాజాగా జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో బ్యాట్‌తో అదరగొట్టిన పాండ్యా.. ఈ మ్యాచ్‌లో బంతితోనూ మెరిశాడు. నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులిచ్చిన పాండ్యా.. సెంచరీ చేసి జోరుమీదున్న స్మిత్‌ను వెనక్కి పంపాడు. టాప్ బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్న వేళ పొదుపుగా బౌలింగ్ చేసిన పాండ్యాపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2020-11-29T22:05:25+05:30 IST