జోయి బిడెన్‌ను పొగిడితే ఆ పార్టీలో చేరతానా? హార్దిక్ పటేల్

ABN , First Publish Date - 2022-04-25T22:00:43+05:30 IST

కాంగ్రెస్‌తో తనకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొంతకాలంగా అసహనంతో రగిపోతున్న హార్తిక్.. నాలుగు రోజుల క్రితం మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం కాంగ్రెస్ పార్టీకి లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు..

జోయి బిడెన్‌ను పొగిడితే ఆ పార్టీలో చేరతానా? హార్దిక్ పటేల్

గాంధీనగర్: భారతీయ జనతా పార్టీపై పొగడ్తలు కురిపించడమే కాకుండా కాంగ్రెస్‌పై పలుమార్లు విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ తొందరలోనే కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వస్తున్న వార్తలపై ఆయన చలోక్తిగా సమాధానం ఇచ్చారు. తాను అమెరికా అధ్యక్షుడు జోయి బిడెన్‌ను పొగిడితే ఆ పార్టీలో చేరుతున్నట్టా అని ఆయననను ప్రశ్నించిన వారిని ఉద్దేశించి హార్దిక్ అన్నారు.


సోమవారం ఆయన ఈ విషయమై మాట్లాడుతూ ‘‘బీజేపీని పొగిడితే బీజేపీలో చేరుతున్నారా అని అడుగుతున్నారు. మరి అమెరికా అధ్యక్షడు జోయి బిడెన్‌ను భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షుడు కమలా హారిస్‌ను పొగిడితే వాళ్ల పార్టీలో చేరుతున్నారా అని అడుగుతారా? ఒకవేళ ప్రత్యర్థులు ఏదైనా మంచి చేస్తే ఒక్కోసారి పొగడాల్సి వస్తది’’ అని అన్నారు.


కాంగ్రెస్‌తో తనకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ కొంతకాలంగా అసహనంతో రగిపోతున్న హార్తిక్.. నాలుగు రోజుల క్రితం మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం కాంగ్రెస్ పార్టీకి లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు. కొన్ని విషయాల్లో బీజేపీ బాగుందని, ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలంటూ గుజరాత్ కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను కలవరానికి గురిచేస్తోంది.

Updated Date - 2022-04-25T22:00:43+05:30 IST