BJP లో చేరిన Hardik Patel

ABN , First Publish Date - 2022-06-02T20:43:14+05:30 IST

ఇక బీజేపీలో చేరిన అనంతరం హార్దిక్ స్పందిస్తూ ‘‘నేనెప్పుడూ ఏ పదవి కోసం ఎవరినీ అడగలేదు. ఒక కార్యకర్తలా పని చేసేందుకే బీజేపీలో చేరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పని చేయనీయదని నేను భావించాను. వేరే పార్టీలు కూడా అలాగే ఉన్నాయని అనుకుంటున్నా. అందుకే ఇతర పార్టీల నాయకులంతా బీజేపీలో చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను..

BJP లో చేరిన Hardik Patel

గాంధీనగర్: కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్(Congress) పార్టీ పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన పాటిదార్ నేత హార్దిక్ పటేల్(Hardik Patel).. భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) తీర్థం పుచ్చుకున్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో ఉన్న పార్టీ రాష్ట్ర కార్యాయలంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సీఆర్ పాటిల్(C R Paatil).. హార్దిక్‌కు కండువా కప్పటి బీజేపీలోకి ఆహ్వానించారు. చేరికకు ముందు ఆయన తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించానని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఒక సాధారణ సైనికుడిలా పని చేస్తానని ట్వీట్ చేశారు.


ఇక బీజేపీలో చేరిన అనంతరం హార్దిక్ స్పందిస్తూ ‘‘నేనెప్పుడూ ఏ పదవి కోసం ఎవరినీ అడగలేదు. ఒక కార్యకర్తలా పని చేసేందుకే బీజేపీలో చేరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన పని చేయనీయదని నేను భావించాను. వేరే పార్టీలు కూడా అలాగే ఉన్నాయని అనుకుంటున్నా. అందుకే ఇతర పార్టీల నాయకులంతా బీజేపీలో చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని అన్నారు. అలాగే నరేంద్రమోదీపై హార్దిక్ ప్రసంశలు గుప్పించారు. మోదీ ప్రపంచ నాయకుడంటూ కీర్తించారు. తాను బీజేపీలో చేరింది జాతీయవాదం, రాష్ట్రవాదం, ప్రజావాదం, సామాజివాదాలతోనని హార్దిక్ పటేల్ అన్నారు.

Updated Date - 2022-06-02T20:43:14+05:30 IST