Breaking: కాంగ్రెస్ పార్టీకి Hardik Patel రాజీనామా

ABN , First Publish Date - 2022-05-18T16:31:45+05:30 IST

కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా సహచరులు గుజరాత్ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని అనుకుంటున్నాను. గుజరాత్ కోసం భవిష్యత్‌లో మరింత ఉత్తమంగా పని చేయడానికి ఈ అడుగు..

Breaking: కాంగ్రెస్ పార్టీకి Hardik Patel రాజీనామా

గాంధీనగర్: Gujarat Assembly కి మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ Hardik Patel రాజీనామా చేశారు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్.. కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చిన హార్దిక్.. ఎట్టకేలకు బుధవారం పార్టీ నుంచి పక్కకు తానే స్వయంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత Sonia Gandhi కి పంపారు. ఆ లేఖను Twitter లో షేర్ చేశారు.


‘‘కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నా సహచరులు గుజరాత్ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని అనుకుంటున్నాను. గుజరాత్ కోసం భవిష్యత్‌లో మరింత ఉత్తమంగా పని చేయడానికి ఈ అడుగు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను’’ అని రాజీనామా లేఖను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై హార్దిక్ విమర్శలు చేస్తున్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని, పార్టీలో అంతర్గత పోరులు సైతం తారా స్థాయిలో ఉన్నాయంటూ హర్దిక్ పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే ఒకానొక సమయంలో ఈ కుమ్ములాటలను పార్టీ చక్కదిద్దుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ వాస్తవంలో అలాంటిదేమీ జరగలేదని హార్దిక్ రాజీనామా చెబుతోందని విశ్లేషకులు అంటున్నారు.

Updated Date - 2022-05-18T16:31:45+05:30 IST