ట్విట్టర్ ప్రొఫైల్ నుంచి కాంగ్రెస్ హోదా, గుర్తును తొలగించిన Hardik Patel

ABN , First Publish Date - 2022-05-03T02:40:54+05:30 IST

కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్

ట్విట్టర్ ప్రొఫైల్ నుంచి  కాంగ్రెస్ హోదా, గుర్తును తొలగించిన Hardik Patel

అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు Hardik Patel సోమవారం తన ట్విట్టర్ బయో నుంచి పార్టీ హోదా, పార్టీ గుర్తు హస్తాన్ని తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. గుజరాత్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పటేల్ త్వరలో పార్టీని వీడనున్నారన్న వార్తలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.  


గుజరాత్ ఫైర్‌బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హార్దిక్ పటేల్ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం జరిగిన పటీదార్ ఆందోళనకు నాయకత్వం వహించారు. తన ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ హోదా, పార్టీ చిహ్నాన్ని తొలగించిన పటేల్.. తన కొత్త ప్రొఫైల్‌లో తనను తాను ‘గర్వించదగిన భారతీయ దేశభక్తుడు’ అని రాసుకున్నారు.  

Read more