
హైదరాబాద్: బీజేపీ సభపై మంత్రి హరీష్‌రావు ట్వీట్ ఇచ్చారు. బీజేపీ సభలో కల్లబొల్లి కబుర్లు తప్ప ఏమీలేవని విమర్శించారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదన్నారు. బీజేపీ నేతలకు జవాబుదారీతనమే లేదని నిరూపించారని చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించామని హరీష్‌రావు పేర్కొన్నారు.