బీజేపీ వాల్లది లంగా పంచాయితీ: హరీష్‌రావు

ABN , First Publish Date - 2022-04-28T22:06:33+05:30 IST

బీజేపీ వాల్లది లంగా పంచాయితీ: హరీష్‌రావు

బీజేపీ వాల్లది లంగా పంచాయితీ: హరీష్‌రావు

సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చేతులెత్తేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం లాస్ అయినా సరే వడ్లు కొంటామని ముందుకచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాక మండలం హబ్సిపూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  మోడీ ప్రభుత్వం ఎంతసేపు రైతులను ముంచే ఆలోచనే చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం నల్లధనం తెచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో 16 లక్షలు వేస్తామని నల్ల ధనం ఏమో గానీ రైతులపాలిట నల్ల చట్టాలను తెచ్చారని విమర్శించారు. తెలంగాణ లో యాసంగి పండేదే బాయిల్ రైస్ అందరికీ తెలిసిందే..  మరి కొనమని చెప్పడం ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ లో పండని పంటను కొంటామని చెప్పడం బీజేపీ వాల్లది లంగా పంచాయితీ అన్నారు. బీజేపీ అంటేనే జూటే మాటలు.. ఇప్పటివరకు రైతులకు ఏం చేసింది లేదన్నారు. టీఆర్ఎష్ రైతులకు ఏం చేసిందో చెప్పుకునేందుకు పది పనులు ఉన్నాయని, బీజేపీ ఏం చేసిందంటే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల రైతులకు అడ్డగోలు ఖర్చు పెరిగిందన్నారు. 


Updated Date - 2022-04-28T22:06:33+05:30 IST