Telangana minister: ఇబ్రహీంపట్నం ఘటనపై మంత్రి హరీష్‌రావు స్పందన

ABN , First Publish Date - 2022-08-31T19:55:35+05:30 IST

ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నిమ్స్‌కు ఆస్పత్రికి చేరుకుని ఇబ్రహీంపట్నం బాధితులను పరామర్శించారు.

Telangana minister: ఇబ్రహీంపట్నం ఘటనపై మంత్రి హరీష్‌రావు స్పందన

హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం ఘటనపై మంత్రి హరీష్ రావు (Harish rao) స్పందించారు.  కు.ని ఆపరేషన్లు చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం బాధితులను హరీష్‌రావు (TRS) పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులను పరామర్శించిన అనంతరం మంత్రి (Telangana minister) మీడియాతో మాట్లాడుతూ...  రెండ్రోజులుగా మహిళల పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు. అపోలో 13, నిమ్స్‌లో 17 మంది మహిళలు సురక్షితంగా ఉన్నారన్నారు. ఇవాళ కొంతమంది, రేపు మరికొంత మంది డిశ్చార్జ్‌ అవుతారని అన్నారు. నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరమని, ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేశామని చెప్పారు. ఏడేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 

Updated Date - 2022-08-31T19:55:35+05:30 IST