
Hyd: కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) అబద్దాలను సాక్ష్యాలతో సహా నిరూపిస్తానని మంత్రి హరీష్రావు (Harishrao) స్పష్టం చేశారు. నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అమిత్షా మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. ‘ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుకు తాము మద్దతు ఇచ్చామో లేదో రికార్డులు చూసుకోమన్నారు.
తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వకున్నా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. మిషన్ భగీరథకు కేంద్రం రూ.2,500 కోట్లు కాదు కదా.. రూ.2 కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలవుతుందని.. పార్లమెంట్లో కేంద్రమంత్రే ప్రకటించారని ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి