అధైర్యపడొద్దు.. కంటికి రెప్పలా చూసుకుంటాం

ABN , First Publish Date - 2022-01-24T05:05:05+05:30 IST

కరోనా సోకితే ప్రజలు అఽధైర్యపడొద్దని, వారిని ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రామచంద్రాపురం పట్టణంలో చేపట్టిన జ్వర సర్వేలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు వి.సింధూఆదర్శరెడ్డి, పుష్పనగేష్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ గ్రామం, పట్టణాల్లో జ్వర సర్వే చేపట్టాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రెండు రోజుల్లో సుమారు 29లక్షల 20వేల ఇళ్లల్లో వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది జ్వర సర్వే నిర్వహించి, సుమారు లక్ష మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారని వెల్లడించారు.

అధైర్యపడొద్దు.. కంటికి రెప్పలా చూసుకుంటాం
ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

ఫీవర్‌ సర్వేలో ప్రజలకు మంత్రి హరీశ్‌రావు భరోసా


రామచంద్రాపురం, జనవరి 23: కరోనా సోకితే ప్రజలు అఽధైర్యపడొద్దని, వారిని ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రామచంద్రాపురం పట్టణంలో చేపట్టిన జ్వర సర్వేలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు వి.సింధూఆదర్శరెడ్డి, పుష్పనగేష్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతీ గ్రామం, పట్టణాల్లో జ్వర సర్వే చేపట్టాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రెండు రోజుల్లో సుమారు 29లక్షల 20వేల ఇళ్లల్లో వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది జ్వర సర్వే నిర్వహించి, సుమారు లక్ష మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారని వెల్లడించారు. వారికి అక్కడికక్కడే ఐసోలేషన్‌ కిట్లు అందించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మరో ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా జ్వర సర్వేను పూర్తి చేస్తామన్నారు. కరోనా సోకితే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లొద్దని, ఇళ్లలోనే హోం ఐసోలేషన్‌ పాటించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. నాణ్యమైన వైద్యం అందేవిధంగా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసిటన్లు మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ప్రజలు సహకరిస్తే త్వరలోనే తెలంగాణాలో కూడా తగ్గుముఖం పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి వెంట వైద్యాధికారి నాగరాజకుమారి, మాజీ కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వి.ఆదర్శరెడ్డి, బి.నగేష్‌, పరమేశ్‌యాదవ్‌, మోహన్‌రెడ్డి, గోవింద్‌యాదవ్‌, ఖదీర్‌, అబ్దుల్‌ గఫార్‌, ఐలేష్‌యాదవ్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-24T05:05:05+05:30 IST