మహిళల టీ20 చాలెంజ్
తెలుగమ్మాయి ప్రణవిచంద్రకు చోటు
మిథాలీ, జులన్‌కు విశ్రాంతి
ముంబై: తాజా ఐపీఎల్‌తో పాటు సమాంతరంగా మహిళల ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈనెల 23 నుంచి 28 వరకు మహిళల టీ20 చాలెంజ్ పేరిట ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. వెటరన్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలకు విశ్రాంతినిచ్చారు. బరిలోకి దిగే మూడు జట్లలోనూ స్వదేశీ, విదేశీ క్రికెటర్లు ఉంటారు. ఈ నేపథ్యంలో సూపర్ నోవాకు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రెయిల్ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, వెలాసిటీకి దీప్తి శర్మ సారథ్యం వహించబోతున్నారు. ప్రతీ జట్టులో 16 మంది చొప్పున ఉంటారు. భారత ప్లేయర్లతో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, విండీస్, ఆస్ట్రేలియాకు చెందిన 12 మంది కూడా ఈ టోర్నీలో చోటు కల్పించారు.

వెలాసిటీకి ప్రణవి:
హైదరాబాద్ సీనియర్ జట్టు వైస్ కెప్టెన్, 20 ఏళ్ల ప్రణవి చంద్ర వెలాసిటీ జట్టులో చోటు దక్కించుకుంది. అలాగే అరుంధతిరెడ్డి, సబ్బినేని మేఘన ట్రెయిల్ బ్లేజర్స్ జట్టుకు ఎంపికయ్యారు.