
సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ: మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు హిజాబ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక రాష్ట్రంలో ఏర్పడిన హిజాబ్ వివాదంపై బ్యూటీ క్వీన్ హర్నాజ్ సంధు మాట్లాడారు. ‘‘ఎందుకు అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటారు’’ అంటూ సంధు ప్రశ్నించారు. ప్రపంచ సుందరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.‘‘హిజాబ్ సమస్యతో సహా అమ్మాయిలను లక్ష్యంగా చేసుకోవడం మానేయాలని సమాజానికి హర్నాజ్ సంధు విజ్ఞప్తి చేసింది. ‘‘అమ్మాయిలు ఎంచుకున్న విధంగా వారిని జీవించనివ్వండి’’ అంటూ ఆమె సూచించారు.కర్నాటక హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఇటీవల విద్యాసంస్థల తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
హర్నాజ్ సంధు గౌరవార్థం ఏర్పాటు చేసిన సమావేశంలో ఓ రిపోర్టర్ హిజాబ్ సమస్యపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.అయితే రాజకీయ పరమైన ప్రశ్నలు అడగవద్దని నిర్వాహకులు విలేఖరిని కోరారు.సమాజంలో అమ్మాయిలను తరచుగా లక్ష్యంగా చేసుకుంటుందో అని తన వేదనను హర్నాజ్ సంధు వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి