హ్యారీ పోటర్‌ సృష్టికర్త!

ABN , First Publish Date - 2022-06-12T05:42:57+05:30 IST

హ్యారీ పోటర్‌... పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. మరి హ్యారీ పోటర్‌ సృష్టికర్త ఎవరో తెలుసా? ఆమె పేరు జె.కె రౌలింగ్‌

హ్యారీ పోటర్‌ సృష్టికర్త!

హ్యారీ పోటర్‌... పిల్లలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. మరి హ్యారీ పోటర్‌ సృష్టికర్త ఎవరో తెలుసా? ఆమె పేరు జె.కె రౌలింగ్‌. 





  1. 1965లో ఇంగ్లాండ్‌లోని యేట్‌లో జన్మించిన రౌలింగ్‌ ఆరేళ్ల వయసులోనే మొదటి కథ రాశారు. పదకొండేళ్ల ప్రాయంలో తొలి నవల రాశారు. 
  2. రౌలింగ్‌ 25 ఏళ్ల వయసులో తల్లి చనిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లారు. తరువాత పోర్చుగల్‌కు మారిపోయారు. అక్కడ పెళ్లి చేసుకున్నారు. కూతురు పుట్టింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. భర్తతో విడిపోయాక కూతురుని తీసుకుని బ్రిటన్‌కు వచ్చేశారు. 
  3. ఇల్లు లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరోజు మాంచెస్టర్‌ నుంచి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు హ్యారీ పోటర్‌ ఆలోచన వచ్చిందట. 
  4. ఆ ఆలోచనకు వెంటనే కార్యరూపం ఇచ్చింది. కానీ ఆ నవలను ప్రచురించడానికి పబ్లిషర్స్‌ ఎవరూ ముందుకు రాలేదు. పన్నెండు మంది పబ్లిషర్స్‌ రిజెక్ట్‌ చేశారు. చివరగా బ్లూమ్స్‌బర్గ్‌ పబ్లిషర్స్‌ మొదటి పుస్తకాన్ని ప్రచురించారు. ఆ తరువాత చరిత్ర తెలిసిందే. 
  5. రౌలింగ్‌ 7 నవలలు రాశారు. అవి 80 భాషల్లోకి అనువదించబడ్డాయి. సినిమాలుగానూ వచ్చాయి. హ్యారీ పోటర్‌గా డానియల్‌ రాడ్‌క్లిఫ్‌ నటించారు.
  6. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల హ్యారీ పోటర్‌ పుస్తకాలు అమ్ముడుపోయాయి. ‘హ్యారీ పోటర్‌ అండ్‌ ద డెత్లీ హాలోస్‌’ అనే నవల విడుదలైన మొదటి గంటలోనే 82 లక్షల కాపీలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. 

Updated Date - 2022-06-12T05:42:57+05:30 IST