జాబ్‌లో కిక్ లేదన్న ఉద్యోగి.. హర్ష గోయెంక రియాక్షన్ ఇదీ!

ABN , First Publish Date - 2022-06-21T01:14:04+05:30 IST

ఏ ఉద్యోగి అయిన ఒక సంస్థలో ఉద్యోగం మానేస్తున్నాడు అంటే దానికి ప్రధాన కారణం ఆ కంపెనీలో ఇచ్చే జీతం సరిపోకపోవడం. పై అధికారులు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక కొందరు.. పర్సనల్ ఇబ్బందులు ఇలా రకరకాల కారణాల వల్ల కూడా ఉద్యోగులు అప్పటి వ

జాబ్‌లో కిక్ లేదన్న ఉద్యోగి.. హర్ష గోయెంక రియాక్షన్ ఇదీ!

ఇంటర్నెట్ డెస్క్: ఏ ఉద్యోగి అయిన ఒక సంస్థలో ఉద్యోగం మానేస్తున్నాడు అంటే దానికి ప్రధాన కారణం ఆ కంపెనీలో ఇచ్చే జీతం సరిపోకపోవడం. పై అధికారులు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక కొందరు.. పర్సనల్ ఇబ్బందులు ఇలా రకరకాల కారణాల వల్ల కూడా ఉద్యోగులు అప్పటి వరకూ పని చేస్తున్న సంస్థకు గుడ్‌బై చెప్పేస్తారు. కానీ.. ప్రముఖ వ్యాపార వేత్త హర్ష గోయెంక సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి మాత్రం.. వింత కారణంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ రాజీనామా పత్రంలో పేర్కొన్న అంశాన్ని సీరియస్‌గా పట్టించుకోవాలని పేర్కొన్న హర్ష గోయెంక.. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. కాగా.. ఇంతకూ విషయం ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్ష గోయెంక సంస్థలో పని చేస్తున్న రాజేష్ అనే వ్యక్తి ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రాజేష్ తన రాజీనామా లెటర్‌లో తనకు జీతం సరిపోకో లేక పై అధికారులు అకారణంగా ఒత్తిడికి గురి చేస్తున్నారనో సాకుగా చూపలేదు. సుత్తి లేకుండా సూటిగా తనకు ఉద్యోగంలో మజా రావడం లేదంటూ జాబ్‌కు గుడ్ బై చెప్పేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ‘డియర్ సర్. నేను రిజైన్ చేస్తున్నా. ఉద్యోగంలో మజా లేదు’ అంటూ పై అధికారులకు తన రాజీనామా లెటర్‌ను పంపించేశాడు. అదికాస్తా హర్ష గోయెంక వరకూ వెళ్లింది. దీంతో స్పందించిన ఆయన.. ‘ఈ లెటర్‌లో చెప్పిన విషయం చాలా సిల్లీగా అనిపించి ఉండవచ్చు. కానీ అందులో చాలా అర్థం ఉంది. ఇది తీవ్రమైన సమస్య. దాన్ని పరిష్కించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొంటూ రాజేష్ రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆ రాజీనామా పత్రం వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం బోరు కొడుతోందనే కారణంతో మూడున్నర కోట్ల జీతం గల జాబ్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.



Updated Date - 2022-06-21T01:14:04+05:30 IST