ఏపీలో అణచివేత పరిపాలన జరుగుతోంది: హర్షకుమార్‌

Published: Fri, 06 Aug 2021 12:40:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏపీలో అణచివేత పరిపాలన జరుగుతోంది: హర్షకుమార్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో అణచివేత పరిపాలన కొనసాగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎస్టీలను టార్గెట్ చేసి పరిపాలన చేయలేదని, ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే ఈ విధంగా చేస్తోందని ఆయన మండిపడ్డారు.


ఇంటర్‌ ఫీజులను ఏ కార్పొరేట్‌ కాలేజీ పట్టించుకోవడంలేదని, కార్పొరేట్‌ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని హర్షకుమార్‌ విమర్శించారు. ఎస్సీల పథకాలను ఎత్తివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ఉన్నా ఎస్సీలకు రుణాలు అందడంలేదని హర్షకుమార్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.