నిరసన దీక్ష చేపట్టిన మాజీ ఎంపీ హర్షకుమార్

ABN , First Publish Date - 2022-03-03T16:42:52+05:30 IST

ఛలో ఆంద్రా యూనివర్శిటికీ వెళ్ళకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటంతో హర్షకుమార్ తన నివాసం వద్ద..

నిరసన దీక్ష చేపట్టిన మాజీ ఎంపీ హర్షకుమార్

రాజమండ్రి: ఛలో ఆంద్రా యూనివర్శిటికీ వెళ్ళకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటంతో మాజీ ఎంపీ హర్షకుమార్ తన నివాసం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంద్రా వర్శిటీ పరిరక్షణ కోసం తాము చేపట్టిన ఛలో ఆంద్రాయూనివర్శిటీను పోలీసులతో అడ్డుకోవటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాల నేతలను, అఖిలపక్ష నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆంద్రా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ఏయూ పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏపీలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కులవివక్ష కొనసాగుతోందని, విశ్వవిద్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని హర్షకుమార్ అన్నారు.

Updated Date - 2022-03-03T16:42:52+05:30 IST