రాహుల్ ప్రతిభకు ఆర్యభట్ట కూడా నమస్కరించాలి : హర్షవర్ధన్ ఎద్దేవా

Jun 16 2021 @ 21:16PM

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘కోవిషీల్డ్ మోతాదుల మధ్య సమయాన్ని పెంచే నిర్ణయం పారదర్శకతతో ఉంటుంది. శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి ఉంటుంది. రాహుల్‌ది నమ్మశక్యం కాని ప్రతిభ. ఆ ప్రతిభను చూసి ఆర్యభట్ట, అరిస్టాటిల్ కూడా రాహుల్ ప్రతిభను చూసి నమస్కరించాలి. టీకాపై గందరగోళాన్ని వ్యాప్తి చేయాలన్న ఎజెండా ఇకపై పనిచేయదు’’ అని డాక్టర్ హర్షవర్ధన్ మండిపడ్డారు. 

రాహుల్ గాంధీ ఏమన్నారంటే...

దేశంలో కరోనా ప్రభావం తగ్గినా, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాహుల్ ట్వీట్ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో మోదీ విఫలం చెందారని ఆరోపించారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్లే దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని మండిపడ్డారు. అంతేకాకుండా కోవిషీల్డ్ డోసుల మధ్య సమయాన్ని ఎలాంటి శాస్త్రీయ ఒప్పందం లేకుండానే పెంచాలని ప్రభుత్వం సిఫార్సు చేసిన వైనాన్ని తప్పుబడుతూ రాహుల్ ట్వీట్ చేశారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.