‘గే’ ట్వీట్‌కి హ్యాండ్సమ్ హీరో గ్రేట్ రియాక్షన్!

Sep 25 2021 @ 15:55PM

సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలతో నేరుగా తమ భావాలు పంచుకునే ఛాన్స్ లభించింది ఫ్యాన్స్‌కి. అయితే, సినిమా హీరోలు, హీరోయిన్స్‌కు ఆన్‌లైన్‌లో వందలు, వేల సంఖ్యలో కామెంట్స్ వస్తుంటాయి ఆన్‌లైన్‌లో. వాళ్లు అన్నీ చదవరు. చదివే ఛాన్స్ కూడా ఉండదు. కాకపోతే, కొన్ని చదివినా వాటికి రియాక్ట్ అవుతారన్న గ్యారెంటీ ఏం లేదు. కానీ, తెలుగు వారికి కూడా పరిచయం ఉన్న ఆరడుగుల అందగాడు, బాలీవుడ్ స్టార్ హర్షవర్ధన్ రాణే ఒక ‘గే‘ ట్వీట్‌కు స్సందించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు!


హర్షవర్ధన్ రాణే తెలుగులో కొన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. కమర్షియల్ హీరోగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ ఇంత వరకూ రాలేదు. కానీ, హర్షవర్ధన్ లుక్స్ విషయంలో మాత్రం ఎవ్వరికీ అనుమానం ఉండాల్సిన పని లేదు. అమ్మాయిలు కలలుగానే రాజకుమారుడిలా ఉంటాడు. అయితే ఆయనకి రొటీన్‌కి భిన్నంగా ఫీమేల్ ఫ్యాన్ నుంచీ కాకుండా ఓ అబ్బాయి నుంచీ ‘ఆహ్వానం‘ అందింది! 


తమిళనాడులోని నవీన్ కుమార్ అనే అభిమాని హర్షవర్ధన్ రాణేను కోలీవుడ్ చిత్రాల్లో నటించమని రిక్వెస్ట్ చేశాడు. ఆయన ట్వీట్‌లో మ్యాటర్ అంతమాత్రమే ఉండుంటే, ఆశ్చర్యమేం కలిగేది కాదు. కానీ, సదరు సౌత్ అభిమాని మన బాలీవుడ్ అందగాడ్ని తమిళ సినిమాల్లో నటించమంటూనే, ‘‘నేను గే’’, అని కూడా చెప్పాడు! తన గే ఫ్యాన్ స్పెషల్ ట్వీట్‌కి, హర్షవర్ధన్ రాణే రియాక్ట్ అయ్యాడు కూడా. ‘గే అయినా, కాకున్నా... నా తరుఫున బిగ్ హగ్‘ అన్నాడు! పనిలో పనిగా తనకు తమిళ చిత్రాలంటే ఇష్టమని చెప్పాడు బీ-టౌన్ బ్యాచిలర్. ప్రధానంగా ధనుష్ మూవీస్ అంటే తనకు ఇష్టమన్నాడు హర్షవర్ధన్. 


‘ఖడ్గం, మగధీర‘ లాంటి చిత్రాల్లో తళుక్కుమన్న కిమ్ శర్మతో హర్షవర్ధన్ రాణే రియల్ లైఫ్ రొమాన్స్ ఆ మధ్య హాట్ టాపిక్‌గా మారింది.   

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.