TV anchor,BJP leader: టీవీయాంకర్, బీజేపీ నాయకురాలు గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2022-08-23T17:10:17+05:30 IST

టీవీ యాంకర్, టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు(BJP leader) సోనాలీ ఫొగట్(Sonali Phogat)...

TV anchor,BJP leader: టీవీయాంకర్, బీజేపీ నాయకురాలు గుండెపోటుతో మృతి

చండీఘడ్: టీవీ యాంకర్, టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు(BJP leader) సోనాలీ ఫొగట్(Sonali Phogat) సోమవారం అర్దరాత్రి గుండెపోటుతో మరణించారు.2019 హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సోనాలీ బీజేపీ అభ్యర్థినిగా ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తన సంస్థ ఉద్యోగులతో కలిసి గోవా(Goa) పర్యటనకు వచ్చిన సోనాలీ గుండెపోటుకు గురయ్యారు. టిక్ టాక్(TikTok) వీడియోలతో(videos) సోనాలీ ఫొగట్ పేరు పొందారు. 2006వ సంవత్సరం వరకు టీవీ యాంకరుగా(TV anchor) కూడా పనిచేసిన సోనాలీ బీజేపీలో చేరారు.


 2020 బిగ్ బాస్(Bigg Boss) రియాల్టీ షోలో కూడా సోనాలీ పాల్గొన్నారు.సోనాలీపై ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బిష్ణోయ్ తన పదవికి ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో సోనాలీకి బీజేపీ టిక్కెట్ వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో బిష్ణోయ్ ఇటీవల ఆమెను కలిశారు.


Updated Date - 2022-08-23T17:10:17+05:30 IST