విశాఖపట్నం: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఈనెల 15న నగరానికి రానున్నారు. ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా రుషికొండలో గల పెమ వెల్నెస్ సెంటర్ (బేపార్కు)కు వెళతారు. అక్కడ ఐదురోజులు చికిత్స తీసుకుంటారు. తిరిగి ఈనెల 20న విశాఖపట్నం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారని జిల్లా అధికారులు తెలిపారు. కాగా రుషికొండలో గల బేపార్కు (గత ఏడాది పెమ వెల్నెస్ సెంటర్‌గా పేరు మార్చారు)కు దేశంలో అనేక మంది ప్రముఖులు చికిత్స కోసం వచ్చి వెళుతుంటారు.