Sonali Phogat: సోనాలీ ఫోగాట్ కేసులో మరో ట్విస్ట్

ABN , First Publish Date - 2022-08-31T18:21:35+05:30 IST

టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు దివంగత సోనాలీ ఫోగాట్(Sonali Phogat) కేసులో మరో ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది....

Sonali Phogat: సోనాలీ ఫోగాట్ కేసులో మరో ట్విస్ట్

చండీఘడ్ (హర్యానా): టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు దివంగత సోనాలీ ఫోగాట్(Sonali Phogat) కేసులో మరో ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది.సోనాలీ ఫోగాట్ హత్య కేసు అనంతరం రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సోనాలీ ఫాం హౌస్‌లో ఉన్న ఆమె ఫోన్, ల్యాప్ టాప్ లను(phone laptop) కంప్యూటర్ ఆపరేటర్ చోరీ చేశారని ఆమె కుటుంబసభ్యులు తాజాగా హర్యానా  పోలీసులకు(Haryana police) ఫిర్యాదు చేశారు.సోనాలీకి సంబంధించిన ల్యాప్ టాప్, డీవీఆర్, మొబైల్ ఫోన్, ఇతర ఆఫీసు సామాగ్రిని కంప్యూటర్ ఆపరేటర్ ఎత్తుకెళ్లాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఫోన్, ల్యాప్ టాప్ లను చోరీ చేసిన నిందితుడైన కంప్యూటర్ ఆపరేటర్ శివం పరారీలో ఉండగా పోలీసులు అతన్ని అరెస్టు(arrests) చేశారు. 


నిందితుడి నుంచి ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. సోనాలీ ఫోగాట్ హత్య కేసులో దర్యాప్తు బాధ్యతను గోవా పోలీసులు సీబీఐకు(cbi) అప్పగించారు.గోవా, హర్యానా పోలీసులు కూడా సోనాలీ హత్య కేసును ఆరా తీస్తున్నారు. 


Updated Date - 2022-08-31T18:21:35+05:30 IST