ఎప్పటికీ మన మధ్యే Puneeth

ABN , First Publish Date - 2022-05-04T18:30:27+05:30 IST

పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే బాధ ఇక చాలని, ఆయన ఎప్పటికీ మనతోనే మనమధ్యలోనే ఉంటారని నటుడు, ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళూరు నగర పోలీసులు

ఎప్పటికీ మన మధ్యే Puneeth

                       - హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌

                       - స్టెప్పులేసిన పోలీసు అధికారులు


బెంగళూరు: పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే బాధ ఇక చాలని, ఆయన ఎప్పటికీ మనతోనే మనమధ్యలోనే ఉంటారని నటుడు, ఆయన సోదరుడు శివరాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళూరు నగర పోలీసులు సోమవారం రాత్రి పునీత్‌ సంబ్రమ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్‌ మాట్లాడుతూ పునీత్‌ లేకుండా ఆరునెలలు ముగిసినా ఇంకా బాధ వెంటాడుతోందన్నారు. కుటుంబికులుగా తమకే కాదని, అభిమానులు, సామాన్యులు బాధపడ్డారన్నారు. పునీత్‌ పుట్టుకతోనే సూపర్‌స్టార్‌ అని, తాము సినిమాలలోకి వచ్చాక స్టార్లు అయ్యామన్నా రు. మంగళూరు అత్యంత ఇష్టమైన ప్రాంతంగా భావిస్తానన్నారు. ఎన్నోసినిమాలకు షూటింగ్‌లకు ఇక్కడికి వచ్చామన్నారు. తండ్రి రాజ్‌కుమార్‌తో కలిసి మ్యూజికల్‌ నైట్‌కు వచ్చానని గుర్తుచేసుకున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పుట్టింటికి రా చెల్లి అనేలాంటి సినిమా రానుందన్నారు. పోలీసులంటే తమ కుటుంబానికి అత్యంత ఇష్టమని, అందుకే వారి పట్ల మాకు ప్ర త్యేక అభిమానమన్నారు. పోలీసులు పునీత్‌ సంబ్రమ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్‌తో పాటు పోలీసు అధికారులు స్టెప్పులేశారు. పునీత్‌ నటించిన ఓ సినిమా పాటకు శివరాజ్‌కుమార్‌తో కలిసి మంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శశికుమార్‌ స్టెప్పులేయడం అందర్నీ ఆకర్షించింది. అంతకుముందు పునీత్‌కు సభలో ఘనంగా నివాళులర్పించారు.

Read more