మద్యంలో ప్రమాదకర రసాయనాలు

ABN , First Publish Date - 2022-06-30T06:22:58+05:30 IST

మద్యంలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని, ఏపీలో ఉన్న బ్రాండ్స్‌ ఎక్కడా లేవని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

మద్యంలో ప్రమాదకర రసాయనాలు
కుంటముక్కల బాదుడే - బాదుడులో పాల్గొన్న మాజీ మంత్రి ఉమా

 మాజీ మంత్రి ఉమా 

జి.కొండూరు, జూన్‌ 29 : మద్యంలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని, ఏపీలో ఉన్న బ్రాండ్స్‌ ఎక్కడా లేవని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కుంటముక్కలలో బుధవారం బాదుడే - బాదుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమాకు  యువనేత సుకవాసి శ్రీహరి ట్రాక్టర్లతో భారీ ర్యాలీతోస్వాగతం పలికారు. ఆయన ప్రజలు కరపత్రాలు పంచారు. జగన్‌ రెడ్డి ప్యారిస్‌ వెళ్లినందుకు  విమానం ఖర్చు రూ.26 కోట్లను ప్రజలపై రుద్దుతున్నారనాన్నరు. టీడీపీ హాయంలో ఇదే గ్రామం నుంచి 16 మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తే దేశ విదేశాల్లో విద్యనభ్యసించారన్నారు. ఎస్టీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలన్ని రద్దు చేశారని, పిల్లలకు విదేశీ విద్య సాయం కూడా జగన్‌ ఆపేశాడన్నారు. 717 కోట్లు ఖర్చుచేశానని చెప్పుకుంటున్న మైలవరం ఎమ్మెల్యే వసంత ఏగ్రామంలో ఎంత ఖర్చు చేశాడో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అన్నారు. ఎన్నికల ముందు రాత్రి వేళల్లో ఇళ్లకు వచ్చి కాళ్లు చేతులు పట్టుకొని నేడు ప్రజలకు కనబడకుండా హైదరాబాద్‌లో ఆస్తులు పెంచుకునే పనిలో పడ్డాడని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జువ్వా రామకృష్ణ, లంక రామకృష్ణ, సుకవాసి శ్రీహరి, లంక లితీష్‌, పటాపంచల నరసింహారావు, గోళ్ల శ్రీనివాసరావు, మన్నం నాగేశ్వరరావు, లంక నాగేశ్వరరావు, ధనేకుల శ్రీకాంత్‌, మన్నం వెంకట చౌదరి, గుడిపూడి శివశంకర్‌, ఆర్‌.శివయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T06:22:58+05:30 IST