కూతురిపై కన్నతండ్రే ఘాతుకం.. కుమార్తె గర్భవిచ్ఛిత్తి అనుమతి కోరిన తల్లి.. హైకోర్టు కీలక ఆదేశాలు!

ABN , First Publish Date - 2022-03-13T01:01:37+05:30 IST

కన్నతండ్రి అత్యాచారం చేయడంతో 10ఏళ్ల అమ్మాయి గర్భం దాల్చింది. ఈ కేసుపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయి తల్లి అభ్యర్థనపట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు.. గర్భవిచ్ఛిత్తికి అనుమతి

కూతురిపై కన్నతండ్రే ఘాతుకం.. కుమార్తె గర్భవిచ్ఛిత్తి అనుమతి కోరిన తల్లి.. హైకోర్టు కీలక ఆదేశాలు!

తిరువనంతపురం: కన్నతండ్రి అత్యాచారం చేయడంతో 10ఏళ్ల అమ్మాయి గర్భం దాల్చింది. ఈ కేసుపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మాయి తల్లి అభ్యర్థనపట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు.. గర్భవిచ్ఛిత్తికి అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కన్నుమిన్నుకానక 10ఏళ్ల కూతురిపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో భర్తపై తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె తల్లి.. తాజాగా కోర్టును ఆశ్రయించింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం 1971 ప్రకారం.. తన కూతురికి అబార్షన్ చేయించడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. చిన్నారికి వైద్య పరీక్షలు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని మెడికల్ బోర్డును ఆదేశించింది. దీంతో వైద్య బృందం ఆ చిన్నారికి వైద్య పరీక్షలు జరిపి కోర్టుకు నివేదికను అందించింది. 



ప్రస్తుతం ఆ చిన్నారి 31 వారాల గర్భవతి అని మెడికల్ బోర్డు తన నివేదికలో తెలిపింది. జన్మించిన బిడ్డ బతికే ఛాన్స్ 80 శాతం ఉంటుందనీ.. అయితే బిడ్డకు జన్మనివ్వడం వల్ల భవిష్యత్తులో ఆ చిన్నారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయని పేర్కొంది. అంతేకాకుండా పుట్టిన బిడ్డకు మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పింది. ఈ నివేదికను పరీశీలించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘బాధిత బాలికపై కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడినట్టు రుజువైతే దానికి నేనే కాదు.. సభ్యసమాజం కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. చట్టం ప్రకారం నిందితుడికి కఠిన శిక్ష అమలు చేసి తీరుతాం’’ అని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఆ చిన్నారి ఆరోగ్యం దృష్ట్యా.. అబార్షన్‌కు అనుమతిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. 




Updated Date - 2022-03-13T01:01:37+05:30 IST