హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ లాభం రూ.8,760 కోట్లు

ABN , First Publish Date - 2021-01-17T06:43:31+05:30 IST

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన

హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ లాభం  రూ.8,760 కోట్లు

ముంబై: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌.. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 14.36 శాతం వృద్ధి చెంది రూ.8,760 కోట్లుగా నమోదైందని వెల్లడించింది. కీలక ఆదాయాలు పెరగటం ఎంతగానో కలిసివచ్చిందని పేర్కొంది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 18.09 శాతం పెరిగి రూ.8,758.29 కోట్లకు చేరుకుందని తెలిపింది.


త్రైమాసిక సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయాలు రూ.36,039 కోట్ల నుంచి రూ.37,522 కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం కూడా 15.1 శాతం వృద్ధి చెంది రూ.16,317 కోట్లుగా నమోదైంది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా శశిధర్‌ జగదీశన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలైన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి.


కాగా బ్యాంక్‌ స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) కూడా 1.42 శాతం నుంచి 0.81 శాతానికి తగ్గాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఇది 1.08 శాతంగా ఉంది. డిసెంబరు 31నాటికి కంటింజెంట్‌ కేటాయింపులు (ప్రొవిజన్స్‌) రూ.8,656 కోట్లు ఉండగా ఫ్లోటింగ్‌ ప్రొవిజన్స్‌ రూ.1,451 కోట్లు ఉన్నట్లు బ్యాంక్‌ పేర్కొంది. మరోవైపు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ చేయకుండా ఆర్‌బీఐ నిషేధం విధించినప్పటికీ మొత్తం అడ్వాన్సులు 9 శాతం పెరిగాయని తెలిపింది.


Updated Date - 2021-01-17T06:43:31+05:30 IST