హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేటు తగ్గింపు... అమల్లోకొచ్చింది... క్రెడిట్ హిస్టరీ, తీసుకునే రుణ మొత్తంతో సంబంధముండదు...

ABN , First Publish Date - 2021-03-04T21:45:41+05:30 IST

ఖాతాదారులు, ఇళ్ల కొనుగోలుదారులకు హెచ్‌డీఎఫ్‌సీ ఓ వెసులుబాటు కల్పించింది. ఖాతాదారులకు హోం లోన్ పై వడ్డీ రేట్లను 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేటు తగ్గింపు... అమల్లోకొచ్చింది... క్రెడిట్ హిస్టరీ, తీసుకునే రుణ మొత్తంతో సంబంధముండదు...

ముంబై : ఖాతాదారులు, ఇళ్ల కొనుగోలుదారులకు హెచ్‌డీఎఫ్‌సీ ఓ వెసులుబాటు కల్పించింది. ఖాతాదారులకు హోం లోన్ పై వడ్డీ రేట్లను 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల క్రెడిట్ హిస్టరీ, తీసుకునే రుణ మొత్తంతో సంబంధం లేకుండా కొత్త రుణాలకు 6.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. అంతకుముందు మందగమనం, ఈ ఆర్థిక సంవత్సరం కరోనా కారణంగా ఆర్‌బీఐ, తదనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తూ కస్టమర్లకు ఊరటను కల్పిస్తోన్న విషయం తెలిసిందే. 


వడ్డీ రేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు... ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంకులు కూడా వడ్డీ రుణ రేట్లను తగ్గించాయి. వరుసగా 6.7 %, 6.65 % శాతానికి రుణాలనందిస్తున్నాయి. హోం లోన్ పై రిటైల్ ప్రైమ్ రుణ రేటు ను కూడా 0.05 శాతం మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో... ఇప్పటికే రుణాలు తీసుకున్న కస్టమర్లకు కూడా వడ్డీ రేటు ఈ మేరకు తగ్గుతుందని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ తగ్గించిన ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు మార్చి 4 వ తేదీ(ఈ రోజు(గురువారం) నుండే అమలవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 

Updated Date - 2021-03-04T21:45:41+05:30 IST