దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పండుగ సాయన్న

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

నిజాం నవాబ్‌కు కొ మ్ముకాసే భూస్వాముల పెత్తందారితనానికి, దోపిడీకి, అణిచివేతకు, ప్రజలమీద చేస్తున్న దాడులకు వ్యతిరే కంగా పోరాడిన మహనీయుడు పండుగ సాయన్న అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

దోపిడీ, అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన  యోధుడు పండుగ సాయన్న
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌, కాంగ్రెస్‌ నేతలు మల్లురవి, ఎర్రశేఖర్‌

- ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

- పండుగ సాయన్న బొమ్మ 

   పెట్టుకోవడానికి అర్హత లేదు: 

   మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌

- పండుగ సాయన్నకు ఘన నివాళి

మహబూబ్‌నగర్‌, ఆగస్టు8: నిజాం నవాబ్‌కు కొ మ్ముకాసే భూస్వాముల పెత్తందారితనానికి, దోపిడీకి, అణిచివేతకు, ప్రజలమీద చేస్తున్న దాడులకు వ్యతిరే కంగా పోరాడిన మహనీయుడు పండుగ సాయన్న అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. పండుగ సాయన్న 132వ జయంతిని పురస్కరించుకుని సో మవారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో  ఆ యన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కళ్లముందే ప్రజలమీద భూస్వామ్య గుండాలు ప్రజల ను దోపిడీ చేసినప్పుడు వారిమీద కన్నెర్రజేశారని అ న్నారు. పెద్దవాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి పేద వాళ్లకు అన్నం పెట్టారని, పేదవాళ్ల హక్కుల ను కా పాడారని, పేదవాళ్ల శీలాన్ని కాపాడిన బిడ్డ పండుగ సాయన్న అని కొనియాడారు. పండుగ సాయన్న విగ్రహాలను గ్రామగ్రామన ప్రతిష్ఠించి ఆయన ఆశ యాలను రాబోయే తరాలకు అందించాలని,   గ్రామా లలో విగ్రహాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను తప్పక పరిశీలిస్తామని స్పష్టం చేశారు. 

= టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్‌ మల్లురవి, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొ త్వాల్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, సంజీవ్‌ముదిరాజ్‌, సీజే బె నహర్‌ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ పేదలకోసం పోరాడిని యోధుడు పండుగ సాయన్న అని పేర్కొన్నారు. పెత్తందారులు, భూస్వాముల దౌర్ఝన్యాలు, దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజలకు అండగా నిలబడ్డారని కొని యాడారు. కార్యక్రమంలో అందెబాబయ్య, లడ్డూ ప హిల్వాన్‌, నాయకులు గోనెల శ్రీనివాస్‌, వెంకటేశ్‌ ముదిరాజ్‌, కృష్ణముదిరాజ్‌లు పాల్గొన్నారు. 

 రెడ్‌క్రాస్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో..

తనకు అన్నివిధాలుగా అండగా ఉన్న తనవారిపై ఇక్కడ అధికారపార్టీ నాయకుడు ఇబ్బందులపాలు చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని మాజీ ఎమ్మె ల్యే ఎర్రశేఖర్‌ అన్నారు. రెడ్‌క్రాస్‌లో ఏర్పాటుచేసిన పండుగ సాయన్న జయంతి వేడుకల్లో ఆయన ప్రసం గించారు. ముదిరాజ్‌లు దూరమవుతున్నారని పండుగ సాయన్న, ఎర్రసత్యం బొమ్మలు పెట్టుకుంటున్నారని, వారి బొమ్మలను పెట్టుకునే అర్హత కూడా లేదన్నారు. ఎన్నికలప్పుడే పార్టీలు చూడాలని, ఎన్నికలయ్యాక పార్టీలను చూడొద్దని, తమ ముప్సై ఏళ్ల రాజకీయాల్లో ఎన్నడూ ఇలాంటి రాజకీయాలు చేయలేదని ఇది ఎక్కువ రోజులు నిలబడదన్నారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని ముదిరాజ్‌లు ఇప్పుడే ఎందుకు గుర్తొస్తున్నారని ప్రశ్నించారు. 

హన్వాడ మండలంలో..

హన్వాడ: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పని చేసిన గొప్ప మహానీయుడు పండుగ సాయన్న అని రైతుబంధు జిల్లా డైరెక్టర్‌ కొండ లక్ష్మయ్య అన్నారు. సోమవారం హన్వాడలో పండుగ సాయన్న జయంతిని పండుగ సాయన్న సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళి అర్పించారు. కార్యక్రమంలో ముడా డైరెక్టర్‌ కొండ బాలయ్య, ఎంపీటీసీ సభ్యుడు పెద్ద చెన్నయ్య, నాయకులు జంబులయ్య, యాదయ్య, కృష్ణయ్య, అంజన్న, కిరణ్‌, సేవా సంస్థ సభ్యులు మోర శ్రీను, దేవేందర్‌, శివ, శంకర్‌, భగవంత్‌పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST