పోలీస్‌ జులుం

ABN , First Publish Date - 2022-07-02T17:35:57+05:30 IST

ఆయనో పోలీస్‌ ఉన్నతాధికారి... ఆయన సోదరుడు మాజీ ప్రజాప్రతినిధి. పోలీస్‌ అధికారి ఆరోపణలు ఎదుర్కొని క్రమశిక్షణ చర్యలకు

పోలీస్‌ జులుం

కారు వెళ్లేందుకు స్థలం వదలాలని ఒత్తిడి

నోటీసులతో ఇబ్బందులు.. బాధితుడి ఆవేదన


హైదరాబాద్‌ సిటీ: ఆయనో పోలీస్‌ ఉన్నతాధికారి... ఆయన సోదరుడు మాజీ ప్రజాప్రతినిధి. పోలీస్‌ అధికారి ఆరోపణలు ఎదుర్కొని క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. తిరిగి కొన్ని నెలల క్రితం తిరిగి విధుల్లోకి చేరారు. అయితే ఆయన నివాసముంటున్న నారాయణగూడ పీఎస్‌ పరిధిలో మాత్రం హడలెత్తిస్తున్నారు. ప్రధాన రోడ్డు నుంచి సోదరులైన వారిద్దరి ఇళ్లకు చేరడానికి 7 అడుగుల వెడల్పు రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డుకు మరో వైపు ఓ వ్యక్తికి సంబంధించిన పురాతన ఇల్లు 44.75 గజాలు ఉంది. ఆ స్థలాన్ని కొనుగోలు చేసుకోవచ్చని సదరు వ్యక్తి ఆ బ్రదర్స్‌కు ఆఫర్‌ కూడా ఇచ్చారు. అవసరం లేదని అప్పట్లో వారు దాటేశారు. కానీ.. కారు లోపలికి వెళ్లాలంటే ఆ బ్రదర్స్‌కు 7 ఫీట్ల రోడ్డుపై ఇబ్బందికరంగా మారింది. దాంతో మరో మూడు అడుగుల స్థలం వదలాలని పరోక్షంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు.


ఆ బాధితుడు పురాతన ఇంటిని కూల్చి... ఇటీవల కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు. పని ప్రారంభించిన నాటి నుంచి... జీహెచ్‌ఎంసీతో పాటు వివిధ విభాగాల అధికారుల నుంచి నోటీసులు వస్తున్నాయి. ఆరా తీస్తే... పోలీస్‌ అధికారితో ఎందుకు పెట్టుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తన జాగాలో తన ఇంటి నిర్మాణం చేపడుతుంటే మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ బాధితుడు వాపోతున్నారు. ఆ అధికారి నుంచి తనకు, తన కుటుంబాన్ని కాపాడాలని బాధితుడు వేడుకుంటున్నారు.

Updated Date - 2022-07-02T17:35:57+05:30 IST