ఆయన విలక్షణ నటుడు

ABN , First Publish Date - 2020-09-09T10:46:42+05:30 IST

ఆయన పుట్టింది కర్నూల్‌ జిల్లా అయినా, జీవితం మొత్తం నల్లగొండతో ముడిపడి ఉంది. జేపీ తండ్రి సాంబిరెడ్డి వృత్తి రీత్యా నల్లగొండ డీఎస్పీగా పనిచేశారు

ఆయన విలక్షణ నటుడు

టాలీవుడ్‌ విలక్షణ నటుడు తాడిపర్తి వీర జయప్రకాశ్‌రెడ్డి  ప్రస్థానం నల్లగొండ నుంచే మొదలు కావడం గర్వించదగిన విషయం. వందలాది నాటకాలు ప్రదర్శించిన ఆయన ఇక లేరని తెలిసి జిల్లా నాటక, రంగసంస్థల కళాకారులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆయనతో అనుబంధాన్ని ఈ సందర్భంగా అంతా గుర్తుచేసుకున్నారు.


నల్లగొండ కల్చరల్‌

ఆయన పుట్టింది కర్నూల్‌ జిల్లా అయినా, జీవితం మొత్తం నల్లగొండతో ముడిపడి ఉంది. జేపీ తండ్రి సాంబిరెడ్డి వృత్తి రీత్యా నల్లగొండ డీఎస్పీగా పనిచేశారు. దీంతో జేపీ 1979లో సెయింట్‌ ఆల్ఫెన్సస్‌ హైస్కూల్‌లో మూడేళ్లపాటు మ్యాథ్స్‌ టీచర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటనపై ఉన్న ఆసక్తితో డాక్టర్‌ రాజారావు ఆర్ట్స్‌ మెమోరియల్‌ అకాడమీని(డ్రామా) స్థాపించి, దానికి అధ్యక్షుడిగా పనిచేస్తూ పలు నటకాలకు రూపకల్పన చేశారు.


1988లో స్థానికంగా జరిగిన ప్రజాపోరు దిన పత్రిక వార్షికోత్సవంలో ప్రదర్శించిన ‘గప్‌చుప్‌’ నాటికకు ఆయన దర్శకత్వం వహించి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు, జేపీ నటనను చూసి మంత్రముగ్ధులై ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో ఎస్‌ఐ పాత్ర అవకాశం కల్పించారు. ఆయన సినీరంగ ప్రవేశం నల్లగొండ నుంచే జరిగింది. దీంతో ఆయన ఏ నాటకాన్నయినా నల్లగొండలో ప్రదర్శించాకే రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించేవారు. ఆయన నటించిన ‘అలెగ్జాండర్‌’ నాటకం ప్రజాదరణ పొందింది. చివరిసారిగా సెయింట్‌ ఆల్ఫెన్ఫస్‌ హైస్కూల్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలకు 2015వ సంవత్సరంలో హాజరయ్యారు.  


పలువురి సంతాపం

జేపీ మృతిపై స్థానిక కోమలి కళా సమితి అధ్యక్షు డు రఘు, ఎంఎల్‌.నరసింహారావు, జనరంజని సంస్థ అధ్యక్షుడు గజవెల్లి సత్యం, నల్లగొండ ఫిలిం సొసైటీ ప్రధాన కార్యదర్శి పున్నఅంజయ్య, నటుడు గోపు హనుమంత్‌రెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రజాపోరు ఎడిటర్‌ యూసు్‌ఫబాబు, గఫూర్‌, రాములుతో పాటు పలువురు నటులు, కవులు, కళాకారులు, సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు.


ప్రముఖులతో అనుబంధం

జేపీ నాటాక, సినీరంగ ప్రవేశం ఇక్కడి నుంచే మొదలు కావడంతో జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నటులతో బలమైన అనుబంధం ఉంది. స్థానికంగా జరిగే ప్రతీ కార్యక్రమానికి జేపీని ఆహ్వానించేవారు. కోమలి కళా సమితి వార్షికోత్సవం సందర్భంగా ‘మనిషి’ నాటక ప్రదర్శనకు హాజరై తన సొంత డ్రామా ‘శరణం గచ్ఛామి’లో నటించే అవకాశం స్థానికులు ఇచ్చారు.


ఆయన విలక్షణ నటుడు

నాటక, సినీరంగంలో తనదైన ముద్రవేసి విలక్షణ నటుడుగా జయప్రకా్‌షరెడ్డి. ఆయన మృతిసై కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. జయప్రకా్‌షరెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లాతో ప్రత్యేక అభిమానం ఉంది. నటనపై ఉన్న మక్కువతో ఇక్కడి పలుప్రాంతాల్లో ‘అలెగ్జాండర్‌’ నాటకాన్ని ఆయన ప్రదర్శించి మన్ననలు అందుకున్నారు.

పెద్దిరెడ్డి గణేష్‌, మనం వికాస వేదిక అధ్యక్షుడు 

Updated Date - 2020-09-09T10:46:42+05:30 IST