ఆ బౌలర్ ఖచ్చితంగా టీమిండియాకి ఆడతాడు : సునీల్ గవాస్కర్

ABN , First Publish Date - 2022-04-19T21:32:45+05:30 IST

ముంబై : ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్‌‌లో చక్కటి వేగంతోపాటు స్థిరంగా గంటకు 150 కిలోమీటర్ల స్పీడ్‌తో బంతులను సంధిస్తున్న తీరు అబ్బురపరస్తోంది.

ఆ బౌలర్ ఖచ్చితంగా టీమిండియాకి ఆడతాడు : సునీల్ గవాస్కర్

ముంబై : ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్‌‌లో చక్కటి వేగంతోపాటు స్థిరంగా గంటకు 150 కిలోమీటర్ల స్పీడ్‌తో బంతులను సంధిస్తున్న తీరు అబ్బురపరుస్తోంది. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై నాలుగు వికెట్లు తీసి తన సత్తా చాటాడు. చివరి ఓవర్‌లో మూడు వికెట్లు తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. దీంతో ఈ కుర్రాడి ప్రదర్శనపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ఉమ్రాన్ మాలిక్ ఖచ్చితంగా టీమిండియాకు ఆడతాడని జోస్యం చెప్పాడు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయగలిగితే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌ను ఆడడం బ్యాట్స్‌మెన్లకు కష్టమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.


‘‘ ఉమ్రాన్ మాలిక్ వేగవంతమైన బంతులను సంధిస్తూ చాలా, చాలా విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్‌లో వేగం కంటే ఎంతో ఖచ్చితత్వంతో బాల్స్ వేస్తుండడం మరింత ఆకట్టుకుంటోంది. ఉమ్రాన్ మాలిక్‌కు సమానమైన వేగంతో బౌలింగ్ చేసే ఇతర బౌలర్లు వికెట్లకు దూరంగా బంతులు విసురుతుండడం చూస్తుంటాం. కానీ ఉమ్రాన్ కొన్ని బంతులను మాత్రమే పక్కకు విసురుతున్నాడు. లెగ్ సైడ్ వేసే వైడ్‌లను నియంత్రించుకోగలిగితే ఉమ్రాన్ మాలిక్ అద్భుతమైన బౌలర్‌గా మారతాడు. ఎందుకంటే వికెట్లే లక్ష్యంగా బాల్స్ వేస్తున్నట్టుగా ఉంటుంది. బంతుల వేగం ఎక్కువగా ఉండడంతో స్ట్రైట్‌గా కొట్టడం కూడా బ్యాట్స్‌మెన్లకు కష్టంగా ఉంటుంది’’ అని సునీల్ గవాస్కర్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమం క్రికెట్ లైవ్‌లో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు. కాగా పంజాబ్ కింగ్స్‌పై ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మాజీ క్రికెటర్ల నుంచి పలువురు రాజకీయ నాయకులు స్పందించారు.

Updated Date - 2022-04-19T21:32:45+05:30 IST