సమస్యకు అతడే సమాధానం

Published: Mon, 08 Aug 2022 00:34:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సమస్యకు అతడే సమాధానం

నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. 2014లో విడుదలైన ‘కార్తికేయ’కు ఇది సీక్వెల్‌. చందు మొండేటి దర్శకుడు. ఆగస్టు 13న పలు భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. శ్రీ కృష్ణుడి కాలంలో సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగర ంతో ముడిపడిన కథ ఇది. ఒక రహస్యాన్ని ఛేదించేందుకు నడుం కట్టిన డాక్టర్‌ పాత్రలో నిఖిల్‌ తనదైన శైలిలో మెప్పించారు. ‘నా వరకూ రానంత వరకే సమస్య, నా వరకూ వచ్చాక అది సమాధానం’ అంటూ ఆయన ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్‌లు అలరించాయి. మంచుకొండలు, సమద్ర నేపథ్యంలో సాగే గ్రాఫిక్స్‌, కాలభైరవ అందించిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలో నటించారు. అభిషేక్‌ అగ ర్వాల్‌, విశ్వ ప్రసాద్‌ నిర్మాతలు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International