స్వార్ధ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారు

ABN , First Publish Date - 2022-05-20T04:54:38+05:30 IST

స్వార్ధ ప్రయోజనాల కోసమే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ రాజకీయంగా జీవితాన్నిచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీని వీడా రని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ తొంగల సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్‌హౌజ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్యతో కలిసి మాట్లాడారు. ప్రస్తు త చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ వేధింపుల వల్లనే టీఆర్‌ఎస్‌ను వీడినట్లు నల్లాల ఓదెలు, భాగ్యలక్ష్మీ చేసిన ఆరోపణలు అవాస్తవమ న్నారు.

స్వార్ధ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గ్రంథాలయ చైర్మన్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌

ఏసీసీ, మే 19: స్వార్ధ ప్రయోజనాల కోసమే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదెలు, జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ రాజకీయంగా జీవితాన్నిచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీని వీడా రని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రేణికుంట్ల ప్రవీణ్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ తొంగల సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్‌హౌజ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్యతో కలిసి మాట్లాడారు. ప్రస్తు త చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ వేధింపుల వల్లనే టీఆర్‌ఎస్‌ను వీడినట్లు నల్లాల ఓదెలు, భాగ్యలక్ష్మీ చేసిన ఆరోపణలు అవాస్తవమ న్నారు. బాల్క సుమన్‌ చొరవ వల్లనే భాగ్యలక్ష్మీకి జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి వచ్చిందని గుర్తు చేశారు. నల్లాల ఓదెలుకు టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్‌, ప్రభుత్వ విప్‌ పదవి కట్టబెట్టినప్పటికీ నియోజ కవర్గాన్ని అభివృద్ధి చేయలేక ప్రజల్లో విశ్వాసం కోల్పో యినందునే పార్టీ అధిష్టానం మూడోసారి టికెట్‌ ఇవ్వ కుండా బాల్క సుమన్‌ను నిలెబట్టి గెలిపించిందన్నారు. బాల్క సుమన్‌ వల్ల టీఆర్‌ఎస్‌లో అవమానాలు, నిర్బంధాలు ఎదుర్కొన్నట్లు వాటిపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలే దని ఓదెలు దంపతులు అనడం విడ్డూరంగా ఉంద న్నారు. సుమన్‌పై చేసిన ఆరోపణలు బేషరతుగా ఉపసంహరించుకోవాలన్నారు. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదనే అక్కసుతో తన స్వార్ధం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఓదెలుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతా రన్నారు. బాల్క సుమన్‌ సారధ్యంలో గతంలో ఎన్న డూ లేని విధంగా చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూమేష్‌, అత్తి సరోజ, నడిపెల్లి విజిత్‌రావు, పల్లపు తిరుపతి, తోట తిరుపతి పాల్గొన్నారు. 

మందమర్రిటౌన్‌,: టీఆర్‌ఎస్‌ పార్టీలో అన్ని పదవు లు అనుభవించి స్వప్రయోజనం కోసం పార్టీ వీడుతూ విమర్శలు చేయడం మాజీ విప్‌ నల్లాల ఓదెలు, ఆయ న సతీమణి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మిలకు తగదని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు జె. రవీందర్‌, మేడిపల్లి సంపత్‌, సంజీవరావు, మద్ది శంకర్‌లు పేర్కొ న్నారు. గురువారం ఎమ్మెల్యే బీ 1 క్యాంపు కార్యాల యం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మూడు సార్లు నల్లాల ఓదెలుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి గెలిపించింది సీఎం కేసీఆర్‌ కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపో యినా ఆయన సతీమణికి జడ్పీ చైర్‌పర్సన్‌గా నియ మించారన్నారు. పదవులు అనుభవించి చివరకు తమ ను బాల్క సుమన్‌ అవమానిస్తున్నాడని, ఎక్కడకు పిలవడం లేదని ఆరోపించడం సరైంది కాదన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎవరూ వారి వెంట వెళ్లరని, బాల్క సుమన్‌ నేతృత్వంలో పనిచేస్తారని తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎస్‌. ప్రభాకర్‌రావు, నాయకులు బడికెల సంపత్‌, మేడిపల్లి మల్లేష్‌, కనకం రవీందర్‌, బట్టు రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-20T04:54:38+05:30 IST