తోక చూసి విమానమేంటో చెప్పేస్తాడు..

ABN , First Publish Date - 2020-12-25T08:43:54+05:30 IST

యూఏఈలో ఉంటున్న పన్నెండేళ్ల భారతీయ బాలు డు విమానాల తోకల (టెయిల్స్‌) ద్వారా అవి ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందినవో గుర్తించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకెక్కాడు.

తోక చూసి విమానమేంటో చెప్పేస్తాడు..

పన్నెండేళ్ల భారతీయ బాలుడికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు 


దుబాయి, డిసెంబరు 24: యూఏఈలో ఉంటున్న పన్నెండేళ్ల భారతీయ బాలు డు విమానాల తోకల (టెయిల్స్‌) ద్వారా అవి ఏ ఎయిర్‌లైన్స్‌కు చెందినవో గుర్తించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకెక్కాడు. హరియాణాకు చెందిన సిద్ధాంత్‌ గుం బర్‌ 60 సెకన్ల వ్యవధిలోనే 39 విమానాల తోకలను బట్టి విమానయాన కంపెనీలను గుర్తించాడని, దీంతో గత నెలలో గిన్నిస్‌ వరల్‌ ్డ రికార్డును సాధించినట్టు గల్ఫ్‌ న్యూస్‌ పేర్కొంది. సాధారణంగా విమానాల తోకలపై ఆయా విమానయాన సంస్థల లోగోలుంటాయి. వీటిని బట్టి ఎయిర్‌లైన్స్‌ కంపెనీని గుర్తించే అవకాశం ఉంటుంది. గుంబర్‌ ఇంతకు ముందు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించుకున్నాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 100 బిల్డింగ్‌లను గుర్తించడమేకాకుండా వాటి ఎత్తు, అవి ఉన్న ప్రాంతాన్ని వెల్లడించాడు. ఈ రికార్డును సాధించిన అత్యంత పిన్న వయస్కుడు గుంబర్‌ కావడం విశేషం.  

Updated Date - 2020-12-25T08:43:54+05:30 IST