Heavy rain: రాష్ట్రానికి భారీ వర్షసూచన
ABN , First Publish Date - 2022-10-03T13:47:23+05:30 IST
ఆంధ్ర సముద్రతీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీవర్షం(Heavy rain) కురిసే అవకాశమున్నట్లు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం
ఐసీఎఫ్(చెన్నై), అక్టోబరు 2: ఆంధ్ర సముద్రతీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీవర్షం(Heavy rain) కురిసే అవకాశమున్నట్లు చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆ కేంద్ర డైరెక్టర్ సెంతామరై కన్నన్ విడుదల చేసిన ప్రకటనలో, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, తేని, దిండుగల్, తెన్కాశి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. నగరానికి సంబంధించి ఆకాశం మేఘావృతంగా కనిపిస్తుందని, కొన్ని చోట్ల ఉరుములతో స్వల్పంగా వర్షం కురుస్తుందని, పగటి ఉష్ణోగ్రతలు 32డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 22డిగ్రీల సెల్సియ్సగా నమోదయ్యే అవకాశముందని తెలిపారు.