Shocking: తల పగిలి ఆస్పత్రికి వచ్చిన మహిళకు ఘోర అవమానం.. కండోమ్‌ ప్యాకెట్‌తో కట్టు కట్టిన వైద్యుడు..

ABN , First Publish Date - 2022-08-21T02:27:52+05:30 IST

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని మోరెనా జిల్లా ఆస్పత్రిలో ఒక వైద్యుడు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు

Shocking: తల పగిలి ఆస్పత్రికి వచ్చిన మహిళకు ఘోర అవమానం.. కండోమ్‌ ప్యాకెట్‌తో కట్టు కట్టిన వైద్యుడు..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని మోరెనా జిల్లా ఆస్పత్రిలో ఒక వైద్యుడు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. రోగి పట్ల ఆయన ప్రవర్తించిన విధానం తీవ్ర విమర్శలకు కారణమైంది. మోరెనాలో జిల్లాలోని ధర్మాఘర్‌కు చెందిన రేష్మాబాయి అనే మహిళ తలకు గాయమైంది. దీంతో ఆమె స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లింది. ఆ సమయంలో డాక్టర్ ధర్మేంద్ర డ్యూటీలో ఉన్నారు. ఆయన రేష్మా బాయి తలకు కట్టు కట్టేందుకు ప్రయత్నించారు. 


ఇది కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఎంత ధైర్యం.. ఆకాశంలో విమానం నుంచి వేలాడుతూ వర్కౌట్‌.. వైరల్ అవుతున్న వీడియో!


బ్యాండేజ్ వేసే ముందు గాయం మీద కార్డ్ బోర్డ్ లాంటిది పెట్టాలని వార్డు బాయ్‌ అనంత్ రామ్‌కి ధర్మేంద్ర సూచించాడు. అయితే కార్డ్ బోర్డ్ అందుబాటులో లేకపోవడంతో వార్డు బాయ్ కండోమ్ ప్యాకెట్ (Condom Pack) పెట్టాడు. దానిని గమనించకుండా ధర్మేంద్ర గాయం మీద కండోమ్ ప్యాకెట్ పెట్టి కట్టు కట్టి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశాడు. అక్కడి వైద్యులు డ్రెస్సింగ్ చేసేందుకు కట్టు విప్పగా కండోమ్ ప్యాకెట్ బయటపడింది. 


బ్యాండేజ్‌ లోపల కండోమ్ ప్యాకెట్‌ను చూసి వైద్యులు షాకయ్యారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళ బంధువులు డిమాండ్ చేశారు. కాగా, డాక్టర్ ధర్మేంద్రను, వార్డ్ బాయ్‌ను సస్పెండ్ చేసినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-21T02:27:52+05:30 IST