కీచక గురువు!

ABN , First Publish Date - 2021-03-07T05:19:23+05:30 IST

గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వక్రబుద్ధి చూపించాడు ఓ ప్రబుద్ధుడు. కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కొన్నేళ్లుగా ఆ ఉపాధ్యాయుడి చేష్టలతో విసిగిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులు... చివరకు దేహశుద్ధి చేశారు. పొందూరు మండలం లైదాం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కీచక గురువు!
పోలీసుల అదుపులో ఉన్న ప్రధానోపాధ్యాయుడు మురళీ కృష్ణ

విద్యార్థినితో ప్రధానోపాధ్యాయుడు అసభ్యకర ప్రవర్తన
దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, గ్రామస్థులు
సస్పెన్షన్‌ వేటు వేసిన డీఈవో
లైదాం ప్రాథమికోన్నత పాఠశాలలో ఘటన
పొందూరు, మార్చి 6:
గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వక్రబుద్ధి చూపించాడు ఓ ప్రబుద్ధుడు. కామంతో కళ్లు మూసుకుపోయి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కొన్నేళ్లుగా ఆ ఉపాధ్యాయుడి చేష్టలతో విసిగిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులు... చివరకు దేహశుద్ధి చేశారు. పొందూరు మండలం లైదాం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.  లైదాం ప్రాథమికోన్నత పాఠశాలలో మూడేళ్లుగా ప్రధానోపాధ్యాయుడిగా కావలి మురళీకృష్ణ పనిచేస్తున్నారు. శనివారం పాఠశాలలో తన గదికి వచ్చిన ఏడో తరగతి విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు భారీగా చేరుకొని హెచ్‌ఎం మురళీకృష్ణను నిలదీశారు. ఆయన నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానం చెప్పడంతో గ్రామస్థులు దాడిచేశారు. పొందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హెచ్‌ఎంను స్టేషన్‌కు తరలించారు. మురళీకృష్ణ అసభ్యకర ప్రవర్తనపై గతం నుంచి ఆరోపణలున్నాయి. ఒకసారి స్థానికులు  దేహశుద్ధి చేశారు. అయినా తీరు మారలేదు. హెచ్‌ఎంను పోలీసులు తీసుకెళ్లిన నాటి నుంచి ఫిర్యాదు చేసిన బాధితులపై ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో కేసు వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. మీడియాలో కథనాలు రావడంతో శాఖాపరంగా ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు శనివారం సాయంత్రం డీఈవో చంద్రకళ.. మురళీకృష్ణపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.                                                                                                                                                                                                                    

Updated Date - 2021-03-07T05:19:23+05:30 IST