జీర్ణాశయ ఆరోగ్యానికి అవకాడో!

ABN , First Publish Date - 2020-12-24T05:31:53+05:30 IST

జీర్ణాశయం చక్కగా పనిచేస్తేనే తిన్న ఆహారం ఒంటికి పడుతుంది. రోజూ ఒక అవకాడో తింటే జీర్ణాశయం చక్కగా పనిచేస్తుందని అంటున్నారు

జీర్ణాశయ ఆరోగ్యానికి అవకాడో!

జీర్ణాశయం చక్కగా పనిచేస్తేనే తిన్న ఆహారం ఒంటికి పడుతుంది. రోజూ ఒక అవకాడో తింటే జీర్ణాశయం చక్కగా పనిచేస్తుందని అంటున్నారు ఇల్లినాయిస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కాలేజీ వ్యవసాయం, వినియోగదారులు, పర్యావరణం విభాగం పరిశోధక విద్యార్థులు. వీరి తాజా అధ్యయనంలో రోజూ అవకాడో తింటే జీర్ణవ్యవస్థకు ఢోకా ఉండదని బయటపడింది. అవకాడోలోని పీచు, మోనోశాచురేటెడ్‌ ఫ్యాట్లు జీర్ణాశయంలోని సూక్ష్మజీవులను ప్రభావింతం చేస్తాయి. అవకాడో ఆరోగ్యరమైనది, సులభంగా జీర్ణమవుతుంది కూడా.


భోజనంలో భాగంగా రోజూ అవకాడో తినేవారిలో జీర్ణాశయంలో బైల్‌ ఆమ్లాల విడుదల తగ్గిపోతుంది. ‘‘అవకాడో తింటే పొట్ట నిండిన భావన కలుగుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అయితే జీర్ణాశయంలోని సూక్ష్మజీవులను ఎలా ప్రభావింతం చేస్తుందనేది తెలియాల్సి ఉంది’’ అంటున్నారు షరోన్‌ థామ్సన్‌ అనే పరిశోధక విద్యార్థి. 25 నుంచి 45 ఏళ్ల వయసున్న 163 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు కనుగొన్నారు పరిశోధకులు. 

Updated Date - 2020-12-24T05:31:53+05:30 IST