నాజూకుగా ఉండాలంటే...

ABN , First Publish Date - 2021-02-18T05:57:35+05:30 IST

ఆహారపదార్థాలు తీసుకునే ముందు వాటిలోని క్యాలరీల విషయాన్ని గమనించుకోవాలి. క్యాలరీలు ఎక్కువ ఉన్న ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది.

నాజూకుగా ఉండాలంటే...

ఆహారపదార్థాలు తీసుకునే ముందు వాటిలోని క్యాలరీల విషయాన్ని గమనించుకోవాలి. క్యాలరీలు ఎక్కువ ఉన్న ఫుడ్స్‌కు దూరంగా ఉంటే మంచిది.

ఏ సీజన్‌లోనైనా నాన్‌వెజ్‌  మితంగా తీసుకోవాలి.

కూరగాయలు, ఆకుకూరలు బాగా తినాలి.

స్వీట్లను అప్పుడప్పుడు తింటే బాధలేదు కానీ తరచూ తింటే శరీరం బరువు పెరుగుతుంది. అందుకే తీపి పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది.

నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

ఫాస్ట్‌ఫుడ్స్‌ నోరూరిస్తాయి కానీ వాటికి దూరంగా ఉంటే మంచిది. లైఫ్‌స్టైయిల్‌ జబ్బుల బారినపడరు. మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 

మితాహారం, ప్రొటీన్‌, న్యూట్రిషన్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మీరు, మీ శరీరాకృతి రెండూ వయసుతో సంబంధం లేకుండా ఎంతో నాజూకుగా ఉంటాయి.

రోజూ నీటిని బాగా తాగాలి. మరీ అతిగా తాగొద్దు. అలా చేస్తే శరీరంలోని పోషకాలు బయటకుపోయే అవకాశం ఉంది.

సమయం దొరికినప్పుడు పాటలు పెట్టుకుని నృత్యం చేయొచ్చు. ఇది మానసికమైన హుషారును ఇవ్వడంతో పాటు మీ శరీరానికి మంచి వ్యాయామాన్ని కూడా ఇస్తుంది. 

నిత్యం యోగా చేయడం వల్ల శరీరాకృతి శిల్పంలా ఉంటుంది. 

ఒకపద్ధతి ప్రకారం రోజుకు 20 నుంచి 50 గుంజీళ్లు తీస్తే శరీరం మొత్తం వ్యాయామవుతుంది. మోకాళ్ల నొప్పులు రావు. తొడల దగ్గర చేరిన కొవ్వు తగ్గుతుంది. పొట్ట తగ్గుతుంది. క్యాలరీలు కరుగుతాయి. అంతేకాదు తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. పుష్టిగా ఉంటారు. మీ శరీరాకృతి దెబ్బతినకుండా ఉంటుంది.

Updated Date - 2021-02-18T05:57:35+05:30 IST