ఆరోగ్యమస్తు

ABN , First Publish Date - 2021-02-26T04:13:43+05:30 IST

పేదలకు రక్త పరీక్షల భారం తీరనుంది.

ఆరోగ్యమస్తు
57 రకాల పరీక్షలు చేసే అత్యాధునిక పరికరం

- తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌కు ఎంపికైన పాలమూరు 

- జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో పూర్తయిన భవన నిర్మాణ పనులు

- మార్చిలో అందుబాటులోకి రానున్న కేంద్రం  

- 57 రకాల పరీక్షలు ఒకే సారి చేసే అవకాశం


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), ఫిభ్రవరి 25 : పేదలకు రక్త పరీక్షల భారం తీరనుంది. ప్రైవేట్‌ ల్యాబ్‌లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసే పని లేకుండా, ప్రభు త్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లోనే అన్ని రకాల పరీక్షలు చేయించుకునే వెలుసుబాటును రాష్ట్ర సర్కారు కల్పించిం ది. తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ అండ్‌ స్పోక్‌ మాడల్‌ పేరుతో సర్కారు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జ నరల్‌ ఆసుపత్రిలో, ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కేంద్రం ద్వారా ఒకేసారి 57 రకాల రక్త, మూత్ర, అవయవాల పని తీరు వంటి పరీక్షలు ఉచితంగా చేయనుంది. మార్చిలో ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తేవయడానికి సన్నాహాలు చేస్తోంది.


మహబూబ్‌నగర్‌లో డయాగ్నోస్టిక్‌ హబ్‌

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డయాగ్నోస్టిక్‌ హబ్‌లను ఏ ర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొదటి విడతలో ఐదు జిల్లాలను ఎంపిక చేసి పనులు కూడా ప్రారం భించింది. రెండో విడతలో పాలమూరు జిల్లాను కూడా ఎంపిక చేసింది. జిల్లా జనరల్‌ ఆసుపత్రి ఆవరణలో ఓ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆ భవన నిర్మాణ పనులు పూర్తి కాగా, అందులో తాత్కాలికంగా ఆసుపత్రికి సంబంఽ దించిన ఓపీ ల్యాబ్‌ కొనసాగుతోంది.


ఒకేసారి 57 రకాల రక్త పరీక్షలు

ఈ సెంటర్‌లో ఒకేసారి రక్త, మూత్ర, అవయవ పని తీరు, థై రాయిడ్‌, లివర్‌, కిడ్నీ పని తీరు, కొలెస్ట్రాల్‌, చికున్‌గున్యా, మలే రియా, డెంగీ, టైఫాయిడ్‌, క్యాల్షియం, సిరమ్‌ క్రియాటినైన్‌, డీహె చ్‌డీఎల్‌, ఎలొక్ట్రరేట్స్‌, హెచ్‌బీఎస్‌హెచ్‌జీ వంటి 57 రకాల పరీక్షలు చేస్తారు. వీటితో పాటు ఖర్చుతో కూడుతున్న సీటి స్కాన్‌, 2డీ ఈకో, అలా్ట్రసౌండ్‌, మ్యామోగ్రఫి లాంటి స్కానింగ్‌ పరీక్షలు కూడా చేయనున్నారు.


నమూనాలు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహన వ్యవస్థ

ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి నమూనాల ను జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్‌ సెం టర్‌కు చేరవేసేందుకు ప్రత్యేక వాహన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీల సంఖ్య, వా టి మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఒకటి, రెండు, లేదా మూడు రూట్లుగా విభజించనున్నారు. ఒక్కో రూట్‌కు ఒక ఫోర్‌ వీలర్‌ వాహనాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకోనున్నారు. ఆ వాహనం ప్రతి రోజూ మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి పీహెచ్‌సీల నుంచి నమూనాలను ఐస్‌ బాక్స్‌లలో పెట్టుకొని తిరిగి తీసుకొని మధ్యా హ్నం మూడు గంటల వరకు జిల్లా కేంద్రా నికి చేరుకుంటుంది.


పని తీరు ఇలా..

జిల్లాలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, యూపీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లను ఈ కేంద్రానికి అనుసంధానం చేస్తారు. ప్రతి రోజూ ఆయా పీహెచ్‌సీలకు, వివిధ ఆసుపత్రులకు వచ్చే వారిలో రక్త పరీక్షలు అవసరమైన వారి నుంచి రక్త నమూనాలు అక్కడే సేకరిస్తారు. ఆన్‌లైన్‌లో రోగి పేరు, బార్‌కోడ్‌, వివరాలు నమోదు చేస్తారు. ఆ నమూనాలను జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రానికి చేరుస్తారు. అన్ని పీహెచ్‌సీల నుంచి వచ్చిన నమూనాలను పరీక్ష చేసి నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఇలా పొందుపరిచిన రిపోర్టులను ఆయా పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో ప్రింట్‌ తీసి రోగికి అందజేస్తారు.


కేంద్రానికి చేరిన అత్యాధునిక వైద్య పరికరాలు

తెలంగాణ డయాగ్నోస్టిక్‌ హబ్‌ కేంద్రానికి అవ సరమైన అన్ని రకాల అత్యాధునిక వైద్య పరికరాలు చేరాయి. కేంద్రంలో వాటిని ఉంచి ఇన్‌స్టాలేషన్‌ కూ డా చేశారు. ఇప్పటి వరకు 20 పరికరాలు రాగా, అందులో సియామ్‌ కంపెనీకి చెందిన మైక్రో అ నలైజర్‌, 340, 540 సెల్‌ కౌంటర్లు, ఇమ్యూనో ఆక్సీ, కోల్డ్‌ రూం, 2డీ ఈకో యంత్రం, ఏసీలు, జనరేటర్‌ లు వచ్చాయి. మరికొన్ని పరికరాలు రావలసి ఉంది.


కొత్త నియామకాలు లేవు

ఈ కేంద్రంలో పని చేసేందుకు కొత్తగా ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. ప్రస్తుతం వివిధ పీహె చ్‌సీల నుంచి ఎనిమిది మంది ల్యాబ్‌ టెక్నీషియన్ల ను డిప్యూటేషన్‌ పద్ధతిన తీసుకున్నారు. వీరికి త్వర లో శిక్షణ ఇవ్వనున్నారు. ల్యాబ్‌ మేనేజర్‌ నియామ కం ఇంకా కలెక్టర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది.

Updated Date - 2021-02-26T04:13:43+05:30 IST