Health benefits of turmeric water: బరువు తగ్గడం నుండి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు, పసుపు నీటితో 7 ప్రయోజనాలు...

ABN , First Publish Date - 2022-08-13T18:09:24+05:30 IST

సాంప్రదాయ భారతీయ ఆయుర్వేద వైద్యంలో పసుపును చర్మ రుగ్మతలు, అలెర్జీలు, ఆరోగ్యపరంగానే కాకుండా, వంటకాలు, వస్త్ర రంగులలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు.

Health benefits of turmeric water: బరువు తగ్గడం నుండి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు, పసుపు నీటితో 7 ప్రయోజనాలు...

పసుపు భారతీయ ఆహారంలో భాగం. చర్మ సంరక్షణలో శూక్ష్మక్రిముల నుంచి కాపాడటంలో ముందు ఉంటుంది, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. సాంప్రదాయ భారతీయ ఆయుర్వేద వైద్యంలో పసుపును చర్మ రుగ్మతలు, అలెర్జీలు, ఆరోగ్యపరంగానే కాకుండా, వంటకాలు, వస్త్ర రంగులలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. 


పసుపు ఎన్నో ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంది, అనేక వ్యాధులతో పోరాడటానికి పసుపు సహాయపడుతుంది. అలాగే, పసుపు నీరు శరీరం టాక్సిన్స్‌ను వదిలించుకోవడానికి, శరీరాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడే సహజమైన డిటాక్స్‌గా పనిచేస్తుంది. 


పసుపు నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందా?

యూరోపియన్ రివ్యూ ఫర్ మెడికల్ అండ్ ఫార్మకోలాజికల్ సైన్స్ పరిశోధన ప్రకారం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న పసుపు అధిక బరువును కంట్రోల్ లో ఉంచుతుంది. అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుందని తేల్చాయి. 


పసుపు నీటిని ఎప్పుడు తీసుకోవాలి:

పూర్వ కాలం నుంచి పసుపు మన శరీరంలోని అనేక రుగ్మతలను నయం చేయడానికి సహాయపడుతుంది.  ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు నీటిని ఒక టీస్పూన్ తేనెతో అల్పాహారానికి ముందు లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవచ్చు.


పసుపు నీటితో 6 ఆరోగ్య ప్రయోజనాలు:

1. ప్రేగులను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడానికి కూడా పసుపు సహాయపడుతుంది. అంతే కాకుండా పిత్తాశయం, ఇతర జీర్ణ ఎంజైమ్‌లలో పిత్త ఉత్పత్తిని పెంచడంలోను, ఉబ్బరం లక్షణాలను తగ్గించడంలో, జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.


2. గుండె జబ్బులను నివారిస్తుంది.

శరీరంలో చాలా తరచుగా, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. పసుపు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్త నాళాల పొరను మెరుగుపరుస్తుంది,. ఇది రక్తపోటును నియంత్రించడంలో రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది.


3. అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది.

వైద్య శాస్త్రం ఇప్పటికీ అల్జీమర్స్ వ్యాధికి నివారణను కనుగొనలేదు, పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది వ్యాధికి ప్రధాన కారణాలైన వాపును నివారించడంలో సహాయపడుతుంది.


4. వాపును తగ్గిస్తుంది.

రాత్రిపూట ఒక వెచ్చని గ్లాసు పసుపు నీరు తీసుకోవడం వల్ల శరీరం మంటతో పోరాడటానికి సహాయపడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ లక్షణాలతో పోరాడడంలో సహాయపడతాయి. వృద్ధులలో వచ్చే కీళ్ల నొప్పులను కూడా పసుపు నీరు తగ్గిస్తుంది.


5. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఎందుకంటే ఇది విషాన్ని తీసివేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా చేస్తాయి. పసుపు నీరు చర్మాన్ని మరింత కాంతివంతంగా ఆరోగ్యవంతంగా చేస్తుంది.


6. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పసుపు నీరు బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి, ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు బలంగా మారుతుంది.

Updated Date - 2022-08-13T18:09:24+05:30 IST