ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్‌ పెంచాలి

ABN , First Publish Date - 2022-01-30T08:27:20+05:30 IST

ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతారెడ్డి అన్నారు...

ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్‌ పెంచాలి

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఎండీ సునీతా రెడ్డి

 హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షణకు బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతారెడ్డి అన్నారు. గత దశాబ్దంలో దేశ జనాభా దాదాపు 15 శాతం పెరిగినప్పటికీ, అందుకుతగ్గట్టుగా ఆరోగ్య సంరక్షణ వ్యయంలో సమానమైన వృద్ది లేదన్నారు. బడ్జెట్‌లో ప్రజారోగ్య వ్యయాన్ని 2.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాల్సిన అవసరముందన్నారు. యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజీ (యూహెచ్‌సీ) లక్ష్యాలకు మద్దతిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అందరినీ ఆరోగ్య కవరేజీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యామ్నాయ ఫైన్సానింగ్‌ విధానాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

Updated Date - 2022-01-30T08:27:20+05:30 IST