
వారణాసి: కరోనా థర్ఢ్ వేవ్ సంకేతాల మధ్య యూపీలోని వారణాసిలో పదిరోజుల పాటు 1.62 లక్షల జనాభా నుంచి ఆరోగ్యపరమైన వివరాలు సేకరించారు. వీరిలో 9055 మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి. వీరిలో 3,424 మంది గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కాగా, 5,631 మంది పట్టణ ప్రాంతానికి చెందినవారున్నారు. ఈ సర్వే రిపోర్టు వచ్చిన వెంటనే ఆరోగ్యశాఖ అప్రమత్తమయ్యింది. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులతో సంబంధం కలిగిన వారి వివరాలు సేకరించే పనిలో పడింది. ఈ సర్వేను మొత్తం 1,098 టీములు నిర్వహించాయి. వీరు ఆరు లక్షలకు పైగా ఇళ్లలో సర్వే నిర్వహించారు.