ట్రూకాలర్స్ నుంచి కొవిడ్ -19 హెల్త్ డైరెక్టరీ
ABN , First Publish Date - 2021-05-01T05:30:00+05:30 IST
భారతదేశంలోని వినియోగదారుల కోసం ట్రూకాలర్ ప్రత్యేకించి కొవిడ్ -19 హెల్త్ డైరెక్టరీని ఆరంభించింది. మనదేశంలో కొవిడ్ మళ్ళీ విజృంభిస్తున్న
భారతదేశంలోని వినియోగదారుల కోసం ట్రూకాలర్ ప్రత్యేకించి కొవిడ్ -19 హెల్త్ డైరెక్టరీని ఆరంభించింది. మనదేశంలో కొవిడ్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో దీన్ని ఆరంభించింది. కొవిడ్ వైద్య సేవలు అందించే ఆస్పత్రులు, సహకారం అందించే సంబంధిత వ్యక్తుల వివరాలను దీన్నుంచి తెలుసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి అధికారికంగా సేకరించిన డేటాబేస్ ఆధారంగా ఇది సమాచారాన్ని ఆప్డేట్ చేస్తూ ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు బేటా వెర్షన్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. మెనూ లేదంటే ట్రూకాలర్ బేటా వెర్షన్ ఆండ్రాయిడ్ యాప్ నుంచి సమాచారం పొందవచ్చు. అలాగే దీన్ని ప్రతిరోజూ అప్డేట్ చేస్తుంటారు.