‘పోషక ఆహారంతోనే Health’

ABN , First Publish Date - 2021-10-27T16:53:36+05:30 IST

మినిస్ట్రీ ఆఫ్‌ ఆయూష్‌ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ హెరిటేజ్‌, సీసీఆర్‌ఏఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం గడ్డి

‘పోషక ఆహారంతోనే Health’

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఆయూష్‌ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడికల్‌ హెరిటేజ్‌, సీసీఆర్‌ఏఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం గడ్డి అన్నారంలోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ‘ఆయుర్వేదం ఫర్‌ పోషణ’ అంశంపై అవగాహన కల్పించారు. ఇన్‌చార్జి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జీపీ ప్రసాద్‌ ఆహారం యొక్క ప్రాధాన్యం అంశంతోపాటు పోషక పదార్థాల ఉపయోగాన్ని విద్యార్థులకు వివరించారు. పోషక ఆహారంతోనే ఆర్యోగంగా ఉంటారని అన్నారు. రిసెర్చ్‌ అసిస్టెంట్‌ (సంస్కృతం) డాక్టర్‌ సత్యబ్రతనంద మాట్లాడారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన వేరుశనగ, నువ్వులు, బెల్లం చెక్కిలతో కూడిన పదార్థాలను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ బిశ్వవరంజాన్‌ దాస్‌, లైబ్రరీయన్‌ కె.శ్రీనివాస్‌, ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T16:53:36+05:30 IST