రంగుల్లో ఆరోగ్యం

Published: Tue, 24 May 2022 00:46:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రంగుల్లో ఆరోగ్యం

కర్షణీయమైన రంగులతో కూడిన పండ్లు, కూరగాయల్లో విలువైన పోషకాలుంటాయి. వాటిలో ఉండే ఫైటోకెమికల్స్‌ను బట్టి పండ్లు, కూరగాయలకు ఆయా రంగులు సమకూరతాయి. అయితే ఒక్కో రంగుకు కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 


అవేంటంటే...

ఆకుపచ్చ: ఈ రంగుతో కూడిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల జీర్ణశక్తి, కాలేయ పనితీరు మెరుగవుతుంది. దంతాలు, ఎముకలు బలపడతాయి. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇందుకోసం సొర, బీర, బెండ కూరగాయలతో పాటు, జామ,  అవకాడొ, ద్రాక్ష మొదలైన పండ్లు తినాలి.

పర్పుల్‌, నీలం: జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె, రక్తనాళాలు, మూత్రాశయాల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం ద్రాక్ష, చిలగడదుంప, క్యాబేజీ, బీట్‌రూట్‌ తినాలి.

ఎరుపు: గుండె బలపడుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కణ ఉత్పత్తి పెరుగుతుంది. అఽధిక రక్తపోటు తగ్గడంతో పాటు చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం రెడ్‌ క్యాప్సికం, టమాటా, పండు మిరప, చెర్రీ తినాలి.

పసుపు, నారింజ: కీళ్లు, కణజాలాలు, మృదులాస్థి మెరుగుపడతాయి. చర్మపు కొల్లాజెన్‌ వృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఎల్లో క్యాప్సికం, ఆరెంజ్‌, ఎల్లో జుకినీ, అరటి, దోసపండు తినాలి. 

తెలుపు, గోధుమ రంగు: పెద్దపేగులు, పొట్ట ఆరోగ్యం మెరుగవుతుంది. అల్సర్లు తగ్గుతాయి. అసిడిటీ అదుపులోకొస్తుంది. ఇందుకోసం వెల్లుల్లి, ఉల్లి, బంగాళాదుంపలు, చామ దుంపలు తినాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.