ఉక్రెయిన్‌ బాధిత విద్యార్థులకు సాయం

ABN , First Publish Date - 2022-04-09T14:05:35+05:30 IST

ఉక్రెయిన్‌లో చదువుకుంటూ యుద్ధం కారణంగా అర్థాంతరంగా రాష్ట్రానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సాయం చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ప్రస్తుతం

ఉక్రెయిన్‌ బాధిత విద్యార్థులకు సాయం

                     - ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం 


అడయార్‌(చెన్నై): ఉక్రెయిన్‌లో చదువుకుంటూ యుద్ధం కారణంగా అర్థాంతరంగా రాష్ట్రానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సాయం చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ కారణంగా అక్కడ చిక్కుకున్న 1890 మంది విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్యలు తీసుకున్నారు. దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు కూడా రాశారు. ఈ యుద్ధం కారణంగా స్వదేశానికి వచ్చిన విద్యార్థుల చదువుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అవాంతరం కలుగరాదని సీఎం స్పష్టంగా తెలిపారన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇటీవల మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ తరహా పాఠ్యప్రణాళి పోలాండ్‌, హంగేరీ, రొమానియా, ఖజకిస్థాన్‌ వంటి దేశాల్లో ఉందని, అక్కడకు వెళ్ళి చదివేందుకు విద్యార్థులకు సహకరిస్తామని చెప్పారని గుర్తుచేశారు. మంత్రి జైశంకర్‌ ఈ తరహా ఆలోచన చేయడానికి సీఎం స్టాలిన్‌ ప్రధాన కారణం. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులు భారత్‌ లేదా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేందుకు ఆసక్తి చూపినా అన్ని రకాల సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. 

Updated Date - 2022-04-09T14:05:35+05:30 IST